చీకటి వెలుగును కప్పింది!
ఆ వెలుగు రేపటి చీకటిని వీడాలని ఎదురు చూస్తుంది!!
అవినీతి నీతిని పాతర వేసింది!
ఆ నీతి అవినీతిని ఏవగించుకుని ఏనాటికైనా తరుముతుంది!!
అసత్యం సత్యాన్ని దాచివేస్తుంది!
ఆ సత్యం అసత్యాన్ని దహించి పైకిలేస్తుంది!!
అధర్మం ధర్మాన్ని
నిర్దాక్షిణ్యంగా నాశనం చేస్తుంది!
ఆ ధర్మం కొరడా ఝరిపి అధర్మాన్ని తాటతీస్తుంది!!
కలత మమతను వేరుచేసింది!
ఆ మమత కలతను చెదరగొట్టితీరుతుంది!!
అసహనం సహనాన్ని రెచ్చగొట్టింది!
ఆ సహనం ఎప్పుడైనా విజయకేతనం ఎగురవేస్తుంది!!
మతి గతి తప్పి స్థిమితం కోల్పోయింది!
గమనంలో మతి గతిని స్ధిర స్ధితిని చేయున్ తధ్యం !!
ఇవే చురకశ్రీ వారి మాటస్వర్ణ
కాంతి బాట !!!