తేది: 10/09/2022
పేరు : డా.దీపక్ న్యాతి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా
అంశం:ప్రజాకవి కాళోజీ
శీర్షిక : ప్రేరణ మూర్తి
తన జన్మదినాన్ని భాషా దినంగా
స్పూర్తి నందించి ఆదర్శంగా నిలిచిన
ప్రజాకవిగా స్తుతించబడ్డ తెలుగు కవి
మన కాలోజీ నారాయణరావు గారు
నిజాం అరాచక,నిరంకుశ పాలనను
కలం ఎత్తి ఎండగట్టిన అభ్యుదయ కవి
తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణకై
గళమెత్తిన ప్రజావాది ఆందోళనల ఆద్యుడు
ఉద్యమాలకు ఊతమిచ్చిన కాలోజీ అన్న
రాజకీయ సాంఘీక చైతన్యాలకు ఆదర్శవంతుడు
జీవితకాలాన్నంతా ప్రజలకంకితమిచ్చిన
పద్మవిభూషణ బిరుదాంకితుడు కాలోజీ
ఆయనెన్నో బిరుదులందుకోవడం కాదు
ఆయన పేరుమీద బిరుదులెందరో
ఎందరికో అందిస్తున్న ప్రేరణ మూర్తి
మహానుభావుల అడుగుల జాడలనే
ఈ తరం వెతికే ప్రయత్నం చేయాలి
మనో నేత్రాన సందర్శించిన వెంటనే
అనుసరించే ప్రయత్నం చేయాలి
డా.దీపక్ న్యాతి
నంది అవార్డు గ్రహీత
రచయిత దర్శకుడు