*"విశ్వమాత"..మానవతావాది.. "స్వలాభంలేని పరోపకారం చేసిన వ్యక్తీ", 'మదర్ థెరీసా' వర్దంతి నేడు*
➖➖➖➖➖➖➖➖➖➖
_"ప్రార్ధించే పెదవుల కన్నా, సాయం చేసే చేతులు మిన్న"_ మదర్ థెరిస్సా
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
★మదర్ థెరీసా ఆగ్నీస్ గోక్షా బొజాక్షు గా జన్మించిన అల్బేనియాదేశానికి చెందిన రోమన్ కాథలిక్ సన్యాసిని, భారతదేశ పౌరసత్వం పొంది మిషనరీస్ అఫ్ ఛారిటిని భారత్ లోని కలకత్తాలో, 1950 లో స్థాపించి,45 సం' రాల పాటు మిషనరీస్ అఫ్ ఛారిటీని భారత్ లో మరియు ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించేలా మార్గదర్శకత్వం వహిస్తూ, పేదలకు, రోగగ్రస్తులకూ, అనాథలకూ, మరణశయ్యపై ఉన్నవారికీ పరిచర్యలు చేసారు.
■ఈమె తన మానవ సేవకు గాను 1979లో నోబెల్ శాంతి పురస్కారాన్ని మరియు 1980 లో భారతదేశ అత్యున్నత పౌరపురస్కార మైన 'భారతరత్న' ను పొందారు.మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ బాగా విస్తృత మై, ఆమె చనిపోయే నాటికి 123 దేశాలలో 610సంఘాలను కలిగి, హెచ్ఐవి ఎయిడ్స్, కుష్టు మరియు క్షయ వ్యాధిగ్రస్తులకు ధర్మశాలలను, గృహాలను, ఆహార కేంద్రాలను, బాలల మరియు కుటుంబ సలహా కార్యక్రమాలను, అనాథ శరణాలయాలను మరియు పాఠశాలలను స్థాపించింది.
■ఆమె అనేక మంది వ్యక్తులు, ప్రభుత్వాలు మరియు సంస్థలచే ప్రశంసింపబడినప్పటికీ, అనేక రకాల విమర్శలను ఎదుర్కున్నారు. ఆమె తన కార్యక్రమాలలో భాగంగా మత మార్పిడులను ప్రోత్సహించడం, గర్భ స్రావం పట్ల తీవ్ర నిరోధకత, పేదరికం పట్ల మతపరమైన నమ్మకాలను కలిగి ఉండడం మరియు మరణశయ్యపై ఉన్నవారికి క్రైస్తవ మతాన్ని ఇవ్వడం వంటి ఆరోపణలను క్రిస్టఫర్ హిచెన్స్, మిఖాయెల్ పరేంటి, అరూప్ ఛటర్జీ వంటి వ్యక్తులు మరియు విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలనుండి ఎదుర్కున్నారు.
అనేక మెడికల్ జర్నల్స్ ఆమె ధర్మశాలలో అందుతున్న వైద్య ప్రమాణతను విమర్శిం చాయి మరియు విరాళాల ధనాన్ని ఖర్చు పెట్టడంలో పారదర్శకత లేక పోవడం పట్ల వ్యాకులత వ్యక్తమైంది.
●ఆమె మరణానంతరం పోప్ జాన్ పాల్ IIచే దైవ ఆశీర్వాదం ( బీటిఫికేషన్)మరియు బ్లెస్డ్ తెరెసా అఫ్ కలకత్తా బిరుదు పొందారు.
*♻ప్రారంభ జీవితం..*
■ ఆగ్నీస్ గోక్షా బొజాక్షు (గోక్షా అంటే గులాబీ మొగ్గ) 1910 ఆగష్టు 26, ఉస్కుబ్, ఒట్టోమన్ సామ్రాజ్యం(ఇప్పుడు స్కోప్జే, మాసిడోనియా) యొక్క ముఖ్య పట్టణంలో జన్మించారు. ఆమె ఆగష్టు 26 న జన్మించినప్పటికీ, క్రైస్తవమతం స్వీకరించిన ఆగష్టు 27,ను తన నిజమైన జన్మదినంగా భావించేవారు.
■ ఆమె తన బాల్యం లోనే మతప్రచారకుల జీవిత కథలపట్ల వారి సేవల పట్ల ఆకర్షింప బడ్డారు, 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి తన జీవితాన్ని మతానికి అంకితం చేయాలని నిశ్చయించుకున్నారు. 18 సంవత్సరాల వయసులో ఇల్లు వదిలి సిస్టర్స్ అఫ్ లోరెటో అనే ప్రచారకుల సంఘంలో చేరారు. తరువాతి కాలంలో తన తల్లిని కాని, సోదరిని కానీ కలవలేదు.
■ ప్రారంభంలో ఆమె సిస్టర్స్ అఫ్ లోరెటో భారతదేశంలో విద్యార్థులకు బోధించే ఇంగ్లీష్ ను నేర్చుకోవడానికి ఐర్లాండ్ కి వెళ్లారు.1929 లో, ఆమె తన కొత్త శిష్యరికం ప్రారంభించడా నికి భారత దేశంలో హిమాలయ పర్వతాల వద్ద నున్న డార్జిలింగ్ కి వచ్చారు.1931 మే 24 లో ఆమె సన్యాసినిగా తన మొదటి మతప్రతిజ్ఞ చేసారు.మత ప్రచారకుల సంఘం పోషక సెయింట్ ఐన తెరేసే డి లిసే పేరు మీదుగా తన పేరును తెరెసాగా మార్చుకు న్నారు. 1937 మే 14 లో తూర్పు కలకత్తా లోని లోరెటో కాన్వెంటు స్కూల్లో ఉపాధ్యా యురాలిగా పనిచేస్తున్నపుడు తన పవిత్ర ప్రతిజ్ఞ చేసారు.
■పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఆనందిం చినప్పటికీ, కలకత్తా చుట్టుపక్కల పేదరికం ఆమెను కదిలించి వేసింది.1943 లో ఏర్పడిన కరువు కలకత్తా నగరానికి కష్టాలను మరియు మరణాలను తీసుకు వచ్చింది మరియు ఆగష్టు 1946 లో ఏర్పడిన హిందూ/ముస్లిం హింస నగరాన్ని నిరాశ మరియు భయాందోళ న లకు గురిచేసింది.
*♻మిషనరీస్ అఫ్ ఛారిటీ..*
■1946 సెప్టెంబర్ 10,లో తెరెసా తన సాంవత్సరిక విరామంలో భాగంగా కలకత్తా నుండి డార్జిలింగ్ లోని లోరెటో కాన్వెంటుకు ప్రయాణం చేస్తున్నపుడు తాను "పిలుపులో పిలుపు"గా పొందిన అనుభవాన్ని గుంరించి తెలియ చేసారు. నేను కాన్వెంటును వదిలి పేదల మధ్య నివశిస్తూ వారికి సేవ చేయాలి. ఇది ఒక ఆజ్ఞ. దీనిని పాటించకపోతే విశ్వాసాన్ని కోల్పోయినట్లే." 1948 లో ఆమె తన సాంప్రదాయ లోరెటో అలవాటును వదిలి నిరాడంబరమైన, నీలపు అంచుగల తెల్లటి నూలు చీరను ధరించి, భారత పౌరసత్వము స్వీకరించి మురికి వాడలలో ప్రవేశించారు.ఆమె మొదట మొతిజిల్ లో ఒక పాఠశాలను స్థాపించారు; అటు వెంటనే అనాథల మరియు అన్నార్తుల అవసరాలను తీర్చ సాగేరు.తొందరలోనే ఆమె కార్యక్రమాలు అధికారుల దృష్టిని ఆకర్షించడం తో పాటు ప్రధానమంత్రి ప్రశంసలు అందుకునే లా చేసాయి.
■1950 అక్టోబరు7 ఆమె వాటికన్ అనుమతి తో మతగురువుల సంఘాన్ని ప్రారంభించారు అదే తరువాత "మిషనరీస్ అఫ్ ఛారిటీ"గా రూపొందింది. ఆమె మాటలలో "ఆకలిగొన్న వారల, దిగంబరుల, నిరాశ్రయుల, కుంటి వారల,కుష్టు వ్యాధి గ్రస్తుల, అందరూ త్యజిం చారని భావించే వారల, ప్రేమించబడని వారల, సమాజంచే నిరాకరింపబడిన వారల, సమాజానికి భారమైన వారల మరియు అందరిచే విసర్జింపబడిన వారల "ను జాగ్రత్తగా చూడడమే ఈ సంఘం యొక్క కర్తవ్యం.
*♻కోల్ కతాలో నిర్మల్ హృదయ్ (2005)..*
■1952 లో మదర్ థెరీసా కలకత్తా నగరంచే ఇవ్వబడిన స్థలంలో మొదటి హోమ్ ఫర్ ది డయింగ్ ను ప్రారంభించారు. భారతదేశ అధికారుల సహాయంతో ఆమె ఒక పాడుబ డిన హిందూ దేవాలయాన్ని పేద ప్రజల ధర్మశాలగా మార్చారు.ఆమె దానికి కాళీఘాట్ పరిశుద్ధ హృదయ నిలయం ( కాళీఘాట్ హోం ఫర్ ది డయింగ్) (నిర్మల్ హృదయ్) గా పేరు పెట్టారు. ఈ నిలయానికి తీసుకురాబడిన వారికి వైద్య సహాయాన్ని అందించి, వారి నమ్మకాల ప్రకారం ఆచార కర్మల ననుసరించి గౌరవంగా చనిపోయే అవకాశం కల్పించారు.
ఆ వెంటనే మదర్ థెరీసా సాధారణంగా కుష్టు వ్యాధిగా పిలువబడే హాన్సెన్ వ్యాధి గ్రస్తులకు "శాంతి నగర్ " అనే పేరుతో ధర్మశాలను ఏర్పాటు చేసారు.
■మిషనరీస్ అఫ్ ఛారిటీఅధిక సంఖ్యలో తప్పిపోయిన పిల్లలను చేరదీసింది, మదర్ థెరీసా వారికి ఆశ్రయాన్ని కల్పించాలని భావించారు. 1955 లో ఆమె అనాథలకూ మరియు నిరాశ్రయులైన యువకుల కొరకు, పరిశుద్ధ హృదయ బాలల ఆశ్రయమైన "నిర్మల శిశు భవన్ "ను ప్రారంభించారు.
■ఈ సంస్థ త్వరలోనే అనేకమంది కొత్త వ్యక్తులను మరియు విరాళాలను ఆకర్షించిం ది, 1960 నాటికి భారతదేశ వ్యాప్తంగా అనేక ధర్మశాలలను, అనాథ శరణాలయాలను, మరియు కుష్టు వ్యాధి గ్రస్తులకేంద్రాలను ఏర్పాటు చేసింది.మదర్ థెరీసా తన సంస్థల
ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు.
■భారతదేశం వెలుపల వీరి మొదటి ఆశ్రయం వెనిజులాలో 1965 లోను, తరువాత 1968 లో రోమ్, టాంజానియా, ఆస్ట్రియాలలోనూ, 1970 లలో ఆసియా, ఆఫ్రికా, యూరోప్లలో అనేక దేశాలలో, మరియు యునైటెడ్ స్టేట్స్లో అనేక ఆశ్రయాలను మరియు ఫౌండేషన్లను స్థాపించింది.
◆ఆమె తాత్త్వికత మరియు ఆచరణలు కొంత విమర్శకు గురిఅయ్యాయి. మదర్ థెరీసా ప్రజలను కేవలం బ్రతికి ఉంచేందుకు పరిమిత మయ్యారు కాని వారి దారిద్ర్యాన్ని సమూలం గా తొలగించేందుకు ప్రయత్నించలేదని డేవిడ్ స్కాట్ వ్రాసారు.
■ది మిషనరీస్ అఫ్ ఛారిటీ బ్రదర్స్ సంస్థను 1963 లోను, ధ్యానపరులైన సిస్టర్ల సంస్థను 1976 లోను స్థాపించబడ్డాయి.
■ 2007 నాటికి మిషనరీస్ అఫ్ ఛారిటీ ప్రపంచవ్యాప్తంగా 450 మంది సన్యాసులను మరియు 5,000 మంది సన్యాసినులను కలిగి, 600 శాఖలను నిర్వహిస్తూ, 120 దేశాలలో పాఠశాలలను, ఆశ్రయాలను కలిగి ఉంది.
■1962 లో పద్మశ్రీ , నెహ్రూ అవార్డు ను 1972 లోను, భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను 1980 లోను,
శాంతికి విఘాతం కలిగించే పేదరికాన్ని మరియు దుఃఖాన్ని తొలగించేందుకు ఆమె చేసిన కృషికి 1979 లో మదర్ థెరీసాకు నోబెల్ శాంతి బహుమతి అందచేసారు.
*★మదర్ థెరీసా నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నపుడు ఆమెను "ప్రపంచశాంతిని పెంపొందించేందుకు మనము ఏమి చేయగలం?" అని అడిగారు."ఇంటికి వెళ్లి మీ కుటుంబాన్ని ప్రేమించండి" అని చెప్పారు.*
*♻జ్ఞాపక చిహ్నలు..*
●మదర్ థెరీసా మహిళా విశ్వవిద్యాలయం, కొడైకెనాల్ లో 1984 లో స్థాపించ బడినది.
● భారతీయ రైల్వే "మదర్ ఎక్స్ప్రెస్", అనే పేరుతో 2010 ఆగష్టు 26 న శతజయంతి సందర్భంలో ప్రారంభించింది.
●2013 సెప్టెంబర్ 5 నాటినుండి, వర్ధంతిని ఐక్యరాజ్య సమితి సాధారణ సభచే "అంతర్జా తీయ దాతృత్వ దినము"గా పాటించ బడు తున్నది.
◆మార్చి 13, 1997 న ఆమె మిషనరీస్ అఫ్ ఛారిటీ అధినేత పదవి నుండి వైదొలిగారు, 1997 సెప్టెంబర్ 5 న మరణించారు.
ఆమె చనిపోయే నాటికి మదర్ థెరీసా మిషనరీస్ అఫ్ ఛారిటీ 4,000 సన్యాసినులు, 300 మంది అనుబంధ సోదర సభ్యులు, మరియు 100,000 పైగా సాధారణ కార్యకర్తలను కలిగి, 123 దేశాలలో 610 శాఖలను కలిగి ఉంది. వీటిలో ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్నవారి సంరక్షణ గృహాలు మరియు హెచ్ఐవి/ఎయిడ్స్, కుష్టు వ్యాధి మరియు క్షయ రోగులకు ఆవాసాలు, ఆహారకేంద్రాలు, అనాథ శరణాలయాలు, మరియు పాఠశాలలు ఉన్నాయి.
(ఆగష్టు 26, 1910 - సెప్టెంబర్ 5, 1997),