అలనాటి మిస్సమ్మ, అప్పుచేసి పప్పుకూడు, గుండమ్మకథ నుండి విచిత్రమైన కథలతో వినోదాత్మక చిత్రాలను నిర్మించడం విజయా పిక్చర్స్ వారి ప్రత్యేకత. కథ కంటే కథనం మిన్న. ఇంటిల్లిపాదీ చక్కగా నవ్వుకునే చిత్రాలకి ట్రేడ్ మార్క్ విజయా సంస్థ. ఆ కోవలో వ్రయత్నమే శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్. పొట్ట కోసం ఒక నిరుద్యోగి పడే పాట్లు ఈ చిత్ర కథాంశం.
శ్రీ రాజేశ్వరీ విలాస్ కాఫీక్లబ్
(1976 తెలుగు సినిమా)"
📒✍️
నా పేరు బికారి నా దారి ఎడారి.
మనసైన చోట మజిలీ.కాదన్న చాలు బదిలీ.
నా దారి ఎడారి నా పేరు బికారి
నా దారి ఎడారి నా పేరు బికారి
తోటకు తోబుట్టువును ఏటికి నే బిడ్డను
పాట నాకు సైదోడు పక్షి నాకు తోడు
విసుగు రాదు ఖుషీ పోదు వేసట లేనే లేదు
విసుగు రాదు ఖుషీ పోదు వేసట లేనే లేదు అసలు నా మరోపేరు ఆనంద విహారి
నా దారి ఎడారి నా పేరు బికారి
నా దారి ఎడారి నా పేరు బికారి
మేలుకొని కలలుగని మేఘాల మేడపై.
మెరుపుతీగలాంటి నా ప్రేయసినూహించుకొని
ఇంద్రధనసు పల్లకీ ఎక్కి కలుసుకోవాలని ఆ... ఆ... ఆ... ఆ...
ఇంద్రధనసు పల్లకీ ఎక్కి కలుసుకోవాలని ఆకాశవీధిలో పయనించు బాటసారి
నా దారి ఎడారి నా పేరు బికారి
నా దారి ఎడారి నా పేరు బికారి
కూటికి నే పేదను గుణములలో పెద్దను
కూటికి నే పేదను గుణములలో పెద్దను
సంకల్పం నాకు ధనము సాహసమే నాకు బలం
ఏనాటికో ఈ గరీబు కాకపోడు నవాబు
ఏనాటికో ఈ గరీబు కాకపోడు నవాబు అంతవరకు నేనొక నిరంతర సంచారి
నా దారి ఎడారి నా పేరు బికారి
నా దారి ఎడారి నా పేరు బికారి