పట్టు బట్టరాదు, పట్టివిడవరాదు
పట్టెనేని బిగియఁ బట్టవలయు
పట్టు విడుటకన్న, బరగఁ జచ్చుట మేలు
విశ్వదాభిరామ వినురవేమ!
తాత్పర్యము:
పట్టుదల లేనిదే ఏ కార్యాన్నిగాని, పనినిగాని మొదలుపెట్టకూడదు. అసలు ఆలోచించుకోకూడదు కూడా. ఒకవేళ
ఏదైనా ఒక పనిని మొదలుపెడితే... సాధ్యం కాకపోయినప్పటికీ చివరివరకు పట్టుదలతో దానిని
పూర్తిచేయాలి. పట్టుదలను వదలడం కంటే.. ప్రాణాలను వదలడం మేలు.