భక్తి అంటే పాపాలు చేస్తూ అవి
పోగొట్టుకోడానికి దేవుని
చుట్టుా తిరగడం కాదు..
దేవుడు చూస్తున్నాడనే
భయంతో పాపాలు
చెయ్యకుండా ఉండడం...
దేవలయంలో విగ్రహంలో
కాక నిరుపెదలలో ఆపన్నులలో
భగవంతుడిని ధర్శించేవారంటే
దేవుడికి ఇష్టం....
సాటి మనిషికి సాయం
చెయ్యని వాడు భగవంతుడిని
బంగారు పూలతో పూజించినా
వ్యర్ధమే.....
మానసిక పవిత్రతకు
శారీరక పవిత్రత కంటే
ప్రాధాన్యత ఎక్కువ ..
కానీ రెండూ
అవసరమైనవే...
మనో మాలిన్యాలు
తొలగిపోకుండా కేవలం
బాహ్యశుధ్ధివల్ల ఒరిగేదేమీ లేదు...
శరీరం శుభ్రంగా ఉంటే
మనసుకు ప్రశాంతత చేకూరి
ఆత్మజ్ఞానం వైపు దృష్టి
పెట్టడానికి అనువుగా ఉంటుంది...