🔴గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు ?
✳ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టిన వారికి చేతులకు ఉన్న చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఆడవారి చేతులు ఎక్కువ తడుస్తూ ఉంటాయి గనుక, పాచిన, పగిలిన చేతులు ఈ ఆవు పేడతో ముద్దలు చేసి పెట్టడం వలన నయం అవుతాయి. ఈ గొబ్బెమ్మలు ముగ్గుల మధ్య దారిలో పెడతారు, అవి తొక్కిన వారి పాదాలకు ఉన్న వ్యాధులు, పగుళ్ళకు ఇవి వైద్యకారి గా పని చేస్తాయి.
ఇంటి ముందు ముగ్గు ఎందుకు వెయ్యాలి ?
✳ముగ్గు ఎక్కువ శాతం, రాతిసున్నము, గుల్లసున్నము, బియ్యం పిండి లేదా రెండూ కలిపి వేస్తారు. సున్నము తో ముగ్గు వేస్తే ఆ వాసనకు తేళ్ళూ, జెర్లు, పాములు వంటి విష కీటకాలు ఇంటిలోకి రావు. బియ్యం పిండితో వేస్తే…ఆ పిండి తినటానికి చీమలు చేరతాయి, అవి ఈ విషకీటకాలను చంపుతాయి, ఫలితం ఒకటే.
మగవారికి మాలతో జపం చేసే సమయం ఉంటుంది, కానీ ఆడవారికి ఆ సమయం ఉండదు కనుక, జ్ఞాన ముద్ర వల్ల కలిగే పలితం, చూపుడు వేలు, బ్రొటన వేలు వాడి ముగ్గువేయటం వలన ఆడవారికి కలుతుంది.
ముగ్గు ఓ రోజు వేయకపోతే… ఆ సదరు మహీళ ఆరోగ్యం బాలేదని లేదా ఆమె మనసు బాలేదని/ ఏదో గొడవ జరిగిందని/ పని ఎక్కువగా ఉందని ఇరుగు పొరుగువారు తెలుసుకుని సహాయపడేవారు. ఇంకా అనుభవం ఉన్న పెద్దలు (మహిళలు), ఓ మహిళ వేసిన ముగ్గు చూసి ఆమె స్వభావం, మానసిక స్ధితి తెలుపగలిగేవారు.
ముగ్గు వేయటం వలన మానసిక వత్తిడితో బాధపడుతున్న మహిళలకు మానసిక సాంత్వన లభిస్తుంది.
🔴మామిడి తోరణాలు ఎందుకు ?
✳మామిడి ఆకులు నుండి వెలువడే సువాసన గాలిలో ఉండే ఎన్నో రాకాల వ్యాధి కారక క్రిములను నశింప చేస్తాయి. ఎక్కువ మంది మనుషులు చేరే చోట తప్పని సరిగా మామిడి ఆకులు కట్టాలి, దీని వలన మనిషి నుండి మనిషికి వ్యాధుల వ్యాప్తి ని కొంత వరకు నివారించ వచ్చు.
ఉగాది పచ్చడి చేదుగా ఉంటుంది, ఎందుకు తినాలి ?
✳ఉగాది పచ్చడి లోని వేపపువ్వులో చాలా ఔషద గుణాలు ఉన్నాయి. ఉగాది పచ్చడిని ఆ నెలంతా తినాలి, అలా తినటం వలన ఆ మాసం లో వచ్చే రోగాలనుండీ మనకు రక్షణ లభిస్తుంది.
🔴అసలు మనకి ఇంతమంది దేవుళ్ళు ఎందుకు ఉన్నారు ?
✳మెదటి నుండీ మనను పాలించే రాజునే దైవంగా పూజించే ఆచారం/ఆనవాయితీ ఉంది, అలా రాజ్యాలని పాలించిన, సుపరిపాలన అందించిన కొంత మందిని మనం దేవుళ్ళుగా పూజించుకుంటున్నాము. సమాజానికి, దేశానికి మంచి పనులు చేసిన వారిని పూజించే సాంప్రదాయం మనకు ఉంది.
భారత దేశంలో ఇష్టదైవ ఆరాధన అని ఓ పద్ధతి ఉంది, దీనిలో భాగంగా ఎవరికి నచ్చిన దేవుళ్ళను వారు సృష్టించుకోవచ్చు/రూపొందించవచ్చు, ఆరాధించవచ్చు. ప్రతీ గ్రామానికి ఓ గ్రామ దేవత ఉంటుంది, ప్రతీ ఏడు ఆమెకు తిరుణాళ్ళు చేస్తారు, ఇది గ్రామప్రజలు కలవటానికి దోహద పడుతుంది.