అల్మైరాలోని బట్టలు కంపుకొడుతున్నాయా? దీనికి కారణం అందులో చేరే బూజులు, పురుగులు కావచ్చు. బట్టలపై చేరే ఆ దుమ్ము, పురుగులు పోవాలంటే కొన్ని చిట్కాలు పాటించండి. చెక్క అల్మైరాలలో వుంచే బట్టలకు బూజులు, పురుగులు పట్టకుండా వుండాలంటే కలరా వుండలు (Naphthalene ) ఉంచుతారు. కలరా వుండలు సులభముగా ఆవిరి అయ్యే గుణము ఉంది.
ఇప్పుడు పెట్రోలియం ఉత్పత్తులనుండి తయారుచేసే నాఫ్తలిన్ బాల్స్ లోని రసాయనాలు గాలిలో వ్యాప్తిచెంది కీటకాలను , బూజు క్రిములను పారద్రోలుతాయి. క్యాంఫర్ బాల్స్ వాసనకి క్రిమి , కీటకాదులు బట్టలలో చేరవు. Naphthalene consists of two benzene rings fused together. Chemical formula: C10H8.
కర్పూరం (Camphor) : ఇది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ వుండో ఒక ఘాటైన వాసన గల పదార్థము. ఇది ఒక వృక్షం నుండి వస్తుంది , భారీ వృక్షము ఇది. స్పటిక సద్రుశమయిన తెల్లటి కర్పూరం.. చెట్టు కాండము , వేళ్ళు , చెక్కలు , ఆకులు , కొమ్మలు , విత్తనాలు నుండి లబిస్తుంది. దీని శాస్త్రీయ నామము " సిన్నమోమం కాంఫోరా ". కృత్రిమం గా టర్పెంటైన్ ఆయిలు(Turpentine oil) నుండి కుడా కర్పూరం తాయారు చేస్తారు.
సంప్రదాయంగా హిందువులు పూజాది కార్యక్రమాలకు విధిగా వినియోగిస్తారు. వెలుగుతున్న కర్పూరం హారతికి భారతీయుల హృదయాలలో ఒక ప్రత్యేక స్థానం ఉన్నది... ప్రవిత్రం గా భావిస్తారు. కర్పూరం ఉండలు మండి పూర్తిగా కరిగిపోతాయి. కర్పూరం (C10H16O) ప్రగాఢమైన , తీక్షణమైన సువాసన వెదజల్లుతుంది.