✳మన శరీరంలో చర్మపు ఉపరితలం సేంద్రియ (ఆర్గానిక్) పదార్థాలతో నిర్మితమై ఉంటుంది. నూనె, నెయ్యి లాంటి తైలాలు కూడా సేంద్రియ ద్రవాలే. కాబట్టి చర్మం మీద నూనెలు పడితే వాటి మధ్య తేలికపాటి రసాయనిక బంధాలు ఏర్పడి చర్మానికి అంటుకుంటాయి. సబ్బుతో కడిగితే కానీ పోవు. కానీ నాలుక ఎపుడూ తడిగా ఉంటుంది. ఉపరితలం అంతా లాలాజలంతో కప్పుకుని ఉంటుంది. అంటే ఒక విధంగా నాలుక ఉపరితలం నిరింద్రియ (ఇన్ఆర్గానిక్) పదార్థమయం. నూనెలకు, నీటికి పడదు. కాబట్టి నూనెల్ని జలవిరోధ (hydrophobic) పదార్థాలు అంటాము. నూనెలు కలిసిన ఆహార పదార్థాలను నమిలినప్పుడు నోటిలో ఎక్కడ చూసినా లాలాజలపు చెమ్మ ఉండడం వల్ల ఆ నూనెలు నాలుకకు అంటుకోవు.