✳మొక్కల్లో 5000 ఏళ్లకు పైగా జీవించేవి కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఉత్తర అమెరికాలో ఉన్న బ్రిసిల్కోన్ పైన్ వృక్షం వయస్సు సుమారు 5063 సంవత్సరాలు. ఇలా ఎన్నో కొనిఫెరస్ చెట్లు వేలాది ఏళ్లు పెరుగుతూనే ఉండగలవు.
కానీ జంతువుల విషయానికి వస్తే పొరిఫెరా వర్గానికి చెందిన కొన్ని స్పాంజీలు పదివేల సంవత్సరాల తరబడి బతికేవి ఉన్నాయి. ఇవి వెన్నెముక లేని జీవులు. అయితే వెన్నెముక ఉన్న జీవుల్లో అత్యంత వయస్సు, అధిక ఆయుర్దాయం ఉన్న జంతువు తాబేలే. సాధారణంగా నీళ్లలో ఉండే తాబేళ్లు, నేలపై తిరిగే తాబేళ్లు వేర్వేరు ప్రజాతులు అనుకుంటాం. కానీ అవి రెండూ ఒకే తరహా జీవులే. 2007 సంవత్సరంలో సుమారు 250 ఏళ్లు జీవించి చనిపోయిన భారతదేశపు తాబేలు 'అద్వైత' అత్యంత అధిక వయస్సు ఉన్న జంతువుగా అభివర్ణిస్తున్నారు.