నా మనసు కోతి రా రామా
మారుతి గ చేయి శ్రీ రామ
నా మనసు రాయి రా రామా
మాని ని గ జెయ్య్ శ్రీ రామ
నా మనసు నావ రా రామా
చుక్కాని వెయ్యి శ్రీ రామ
చుక్కాని వెయ్యి శ్రీ రామ
నా మనసు...
మాయ లేడీ రా మనసు రామా..
శరము తో తరుము శ్రీ రామ
నా మనసు వాలి రా రామా
బాణము న గూల్చు శ్రీ రామా..
బాణము న గూల్చు శ్రీ రామా..
నా మనసు..కోతిరా..రామ
నా మనసు కడలి రా రామ..
అమ్ము తో అణుచు రామా
నా మనసు లంక రా రామా..
కాల్చి బూడిద చేయ్యు రామా...
కాల్చి బూడిద చేయ్యి రామా...
నా మనసు....
మనసంతా రావణమే రామ..
చీల్చి చెండాడు శ్రీ రామ ...
నా మనసు...
నా భక్తి సీతమ్మ రామ...
అగ్గి లో తోయకురా రామా
నా భక్తి జానకి రా రామా
అడవి పాల చేయకు.. రామా....