దేవదేవం భజే దివ్య ప్రభావం
రావణాసురవైరి రణపుంగవం ॥దేవ॥
రాజవరశేఖరమ్ రవికుల సుధాకరం
ఆజానుబాహు నీలాభ్ర కాయం
రాజారికోదండ రాజదీక్షాగురుం
రాజీవలోచనం రామచంద్రం రామం ॥దేవ॥
నీలజీమూత సన్నిభశరీరమ్ ఘన వి
శాలవక్షమ్ విమల జలజనాభం
తాలాహినగహరం ధర్మసంస్థాపనం
భూలలనాధిపం భోగిశయనం ॥దేవ॥
పంకజాసన వినుత పరమనారాయణం
శంకరార్జిత జనక చాపదళనమ్
లంకా విశోషణం లాలిత విభీషణం
వెంకటేశం సాధు విబుధ వినుతం రామం ॥దేవ॥