నిజానికి ఈ తిథిని సంకట హర చవితి" అని వ్యవహరించాలి. అయితే, "సంకట హర చతుర్థి, సంకష్ట హర చతుర్థి, సంకట చతుర్థి, సంకట చవితి అని కూడా అంటారు.
సంకటహర చవితి ప్రతీ మాసంలో పౌర్ణమి తరువాత వచ్చే రాత్రిగల చవితి
తిథి (బహుళ చతుర్థి)
నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రదోష కాలంలో "చవితి " ఉన్నరోజే " సంకట హర చవితి".
ఎప్పుడైనా, ప్రదోష కాలంలో చవితి రెండు రోజులు ఉంటే, రెండవ రోజే "సంకట హర చవితి".
చవితి తిథి అధిపతి వినాయకుడు. సకల
సంకటములు హరించే
చతుర్థిగా ఈ తిథికి ఆ పేరు వచ్చింది.
ఈరోజు సంకట హర
వినాయకుని భక్తీ శ్రద్ధలతో పూజిస్తే సకల కామ్యములు సిద్ధిస్తాయి అని
గణపతి పురాణంలో
చెప్పబడి ఉంది.
ఈ వ్రతమును 3, 5, 11, 21 నెలలు ఆచరిస్తారు.
,
సంకట హర చవితి "వ్రతము" ప్రారంభించే వారు తెల్లని లేదా ఎర్రని కొత్త బట్టను తీసుకొని దానికి పసుపు పెట్టి, గణపతి
ముందర ఉంచి, కొంచం కుంకుమ వేసి,
మనసులోని కోరికను
స్వామివారికి విన్నవించి; మూడు దోసిళ్ళ
బియ్యము పోసి, మూడు తమలపాకులు ఉంచి,
రెండు వక్కలు, రెండు
ఖాజ్జూరములు, దక్షిణ,
తమలపాకుల పై ఉంచి; మరోసారి స్వామికి కోరికను విన్నవించి, ముడుపు కట్టి; నమస్కరించి, పూజించాలి.
ఈ వ్రతము పూర్తి చేసిన తరువాత, అంటే, మీరు సంకల్పముచేసిన నెలలు (3, లేదా 5 లేదా 11 నెలలు లేదా 21 నెలలు) పూర్తి అయే ఆఖరి నెలనాడు ఆ ముడుపులోని బియ్యముతో పొంగలి చేసి స్వామివారికి నివేదన చేయాలి.
ఈ చవితితిథి నాడు, సూర్యొదయం పూర్వమే
లేచి ఇల్లంతా శుభ్ర పరచుకొని, మంగళ స్నానం చేసి, ఉపవాస దీక్షతో (ఉడికిన, ఉప్పు సంపర్కం ఉన్న
పదార్ధములు నిషిద్ధము -- అంటే,పాలు, పండ్లు,
పచ్చి కూరలు సేవించ వచ్చును) ఉండాలి .
(ఉపవాసం చేయలేని వారు, వృద్ధులు, శరీర ఆరోగ్యం సహకరించని వారు సాత్విక ఆహారాన్ని(అంటే శరీరం నిలబడటానికి అవసరమైన ఆహారాన్ని) తీసుకొని "సంకట నాశన గణేశ స్తోత్రము" 4 సార్లు పారాయణ చేసి, గణపతిని భక్తి శ్రద్ధలతో సేవించి, సమీపములో గణేశ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకొని, రాత్రి చంద్ర దర్శనం, నక్షత్ర దర్శనం చేసి నమస్కరించుకుని అటుపై భోజనము చేయాలి.)
సాయంత్రం స్నానం ఆచరించి, సంకల్పంతో
గణపతికి అధర్వణ శీర్షం 11 లేదా 21 సార్లు చెప్తూ అభిషేకం (చెరుకు రసంతో అభిషేకం స్వామికి ప్రీతి)
ఆచరించి, షోడస ఉపచారములతో పూజ,
అష్టోత్తరశత నామాలతో అర్చన, ఏకావింశతి
పత్రములతొ, పూలతో పూజించి (తులసి తో చేయరాదు ఒక్క వినాయక చవితి నాడు మాత్రమె తులసితో పూజించ వచ్చు), ఇరవై
ఒక్క నామాలతో దూర్వాయుగ్మ పూజ చేస్తూ, గణపతి ని స్మరించాలి....
నివేదనగా ఆవు నేతితో
చేసిన 21 మోదకములు (21 రకాల పిండి వంటలు చేయడం కూడా చెప్పబడి ఉంది) నివేదన చేసి, 21 మోదకములు బ్రాహ్మణ బ్రహ్మచారికి దానంగా ఇచ్చి, మంగళ హారతి ఇచ్చి, సంకష్టహర గణపతి స్తోత్రం చేసి, తరువాత చంద్ర
దర్సనం చేసికొని, చంద్రునికి మూడు మార్లు అర్ఘ్య
ప్రదానం చేసి, ఈ వ్రతాన్ని సంపూర్ణం చేసుకొని,
తరువాత వీలును బట్టి
బ్రాహ్మణులకు భోజనం
పెట్టి, తరువాత వ్రతం చేసుకొన్న వారు భోజనం చేయాలి. ఇలా చేస్తే, ఆ సంకష్ట హర గణపతి యొక్క
సంపూర్ణ కృపకు పాత్రులై, తలచిన, సంకల్పించిన
సకల కార్యములు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. విద్యార్ధులకు విశేష ఫలితం లభిస్తుంది అని చెప్పబడి ఉంది.
**(గణపతి ఆలయాల్లో "నిర్ణీత రుసుము" కడితే, సంకష్ట హర చతుర్థికి గోత్రనామాలతో పూజలు నిర్వహించి, ప్రసాదం కూడా ఇస్తున్నారు. ప్రస్తుత జీవన శైలిలో వ్రతవిధానం యదావిధిగా పాఠించలేని వారు, ఈ విధంగా సేవించుకోవడం కూడా ఆమోదయోగ్యమే అంటారు పెద్దలు. ముడుపు కట్టుట, విఘ్నేశ్వరుని పూజించుట తప్పక ఆచరించాలి. ఉపవాస విరమణ "చంద్ర దర్శనం", “నక్షత్ర దర్శనం” తరువాతే అన్నది గమనించాలి)