లక్ష్మీ రావే మా ఇంటికి
వరలక్ష్మి రావే మా ఇంటికి
క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి
లక్ష్మీ రావే మా ఇంటికి
రాజితముగా నెలకొన్న
సూక్ష్మముగా మోక్షమిచ్చు
సుందరి బృందావన ధారి lలక్ష్మిl
కుంకుమపచ్చ కస్తూరి
కోరికతోను గోరోజనము
జాజిపూవు జలజ లోచిని
ముదముతోన అర్పింతుము
చల్లనిగంధము చందనముతో
సాంబ్రాణి ధూపము
మాతా నీకు ప్రీతిగ
ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మా lలక్ష్మీl
పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యం
పచ్చ బిల్వమును పూల కలశము
మాతా నీకు ప్రీతిగ
ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మా l లక్ష్మీl
గుండుమల్లె మొగలిపూలు
దండిగా చామంతి పూలు
మేలైనా పారిజాతము
మాతా నీకు ప్రీతిగ
ప్రఖ్యాతిగా సమర్పింతునమ్మా lలక్ష్మీl
అందముగా జరీ అంచుచీర
కుందనము పచ్చని రవిక
మొగలి పూవుల జడనే అల్లి
జడకుచ్చులను కట్టెదమ్మ
మాతా నీకు ముదముగా
మేము చేతుమమ్మ చక్కనిపూజ lలక్ష్మీl…
అందముగా అడవి పళ్ళు
కదళీ పళ్ళు రేగు పళ్ళు
మేలైన దానిమ్మపళ్ళు
ఘనాముగా కర్పూర పళ్ళు
పండువెన్నెలతో నీకు
పద్మాసిని నే పూజింప lలక్ష్మీl