మహాలక్ష్మి ఎవరి ఇంట నివసిస్తుంది..! సర్వ సంపదలకు అధినేత్రి అయిన ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవరు ఉంటారు.?
ఆమె దృష్టి మన మీద పడడం కోసం మనం ఎన్నో పూజలు, వ్రతాలూ, నోములు, యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటాము..
కానీ నిజానికి..., శ్రీ లక్ష్మి దేవి యొక్క నివాస స్థానం, ఆమె ప్రీతి కొరకు చెయ్యాల్సిన పనులు వంటి వాటి కోసం ఇప్పుడు మనం సూక్ష్మంగా తెలుసుకొందాము..
మహాలక్ష్మి దేవి నివసించే స్థానాలు ఏవి?
యత్యత్ మంగళం ఆయత్తం శుచి స్వచ్చం హితం శుభం
తత్తత్ సర్వం మహాలక్ష్మియాన్ స్థానం ఇతి పరికీర్తితం
మహాలక్ష్మి అమ్మవారు నివసించే స్థానాలు మొత్తం 96 గా శాస్త్రం చెప్పబడింది.
కాని అందులో ముఖ్యంగా
పసుపు కుంకుమ
బంగారం. రత్నాలు
ఆభరణాలు ముత్యాలు శుభ్రమైన తెల్లని వస్త్రాల యందు (నల్లని మరియు ఎర్రని వస్త్రాల యందు లక్ష్మి దేవి ఉండదు)
వెండి, రాగి, ఇత్తడి కళశాల యందు
ఆవు పేడ ,ఆవు పృష్ట స్థానం,ఆవు కొమ్ముల మధ్యన,పూజా మందిరం,పవిత్రమైన మనస్సు,దర్బలు,మహానుభావులుయోగులు,మునులు,ఋషులు,ఉత్తమమైన రాజు,సదాచార బ్రాహ్మణుడు...
ఇలా మొత్తం 96 చోట్లు లక్ష్మి నివాస స్థలాలుగా చెప్పబడ్డాయి.
అలాగే లక్ష్మి నివసించని స్థానాలు కూడా చెప్పబడ్డవి.
తల దువ్వుకోకుండా వెంట్రుకలు విరబోసుకుని ఉన్న స్త్రీల యందు,
ఏ ఇంటి యందు స్త్రీలు దుఃఖిస్తారో,
సగం వస్త్రాలు ధరించిన వారిలోఏ ఇంటి యందు పరిశుభ్రత ఉండదో అనాచారం ఉన్న చోట నఖములు ఉన్న చోట, కేశములు ఉన్న చోట, చూపులో, పలుకులో కఠినత్వం ఉన్న చోట హింస లో.,
హింసించే ఆయుధంలో
ఇలా మహాలక్ష్మి లేని చోట్లు 46 చెప్పబడ్డాయి.
ఎక్కడైతే మహాలక్ష్మి నివశించదో అక్కడ లక్ష్మి దేవి అక్కగారైన జేష్టాదేవి (దరిద్రదేవత) ఉంటుంది.