######################
######################
ఆకుపచ్చని నా తామరతోపులో పాలమీగడ తరగల చెక్కిళ్ళున్న ఓ..నా పడుచుపిల్లా !
నీ ముఖారవిందం వసంతంలా కాంతులీనుతుంటే ఆ నీ నవ్వులు చూపులు పైపైనవి కావే అమ్ముడు!!
నీ హృదయ అంతరంగ ఆనందాల హరివిల్లులు,ఏ తామరలో దాగిఉన్నాని వెతికి వెతికి వడిసి పట్టి!
మత్తుగా గమ్మత్తుగా గంతులతో నాపై చిందులు వేసే ఓ నా మహీ!!
ఎర్ర ఎర్రని తామరలను నీ ముచ్చటైన పెదాలతో ముద్దాడుతూ,మురిపంగా ఆడుతూ!
నన్ను వొక్కిరిబుక్కిరి చేసే నా హృదయ మనో రంజని!!
నీ చేతిలోని ఆ పుష్ప కాడల వీణ చేతికొనలతో మీటి గుండెల సప్తస్వరాల పలికిస్తూ ఉంటే!!
శృతిలయలనై
నే మై మరచి పోనా నీ వెంటే నడిచి ఉండిపోనా ఓ మనసా!
నా శరీరపు తోపున తేలియాడుతూ పుష్ప గుత్తులను నేనే అని పైయదను హత్తుకుంటూ!!
సిగ్గు వొగ్గులతో ఓర చూపులు ఒలకబోసే పకపకనవ్వులరాణి!
నన్ను నీ వడిలో మనసారా లాలనగా పాలన చేసే సుందరీ!!
నీ కిలకిల నవ్వుల సవ్వడులల్లో నా హృదయ స్పందన/(లవ్వు,నవ్వు) లబ్ డబ్ ఉందే వనజాక్షీ!
నీ హృదయ మందిరం నిజమైన నా జీవ ఆలయప్రాంగణం స్వర్ణ మంజరీ!!
ఇలాంటి ప్రేమే ఖచ్ఛితమైన విశ్వప్రేమ జగతిన నన్ను వదలి పోకే ప్రేమమయీ!
పొద్దున జలకొలను న పుష్పించే సూర్య తారక!!
నీ అడుగుల చప్పుడు తో నాలో దాగిన ప్రేమ తట్టితట్టి ఏడు అడుగుల బంధానికి ఇంధనమైయే!
అందుకే నీవే కావాలి నాప్రియా !
నీవు నాపై నడియాడి జతచేరకపోతే నాలో జవసత్త్వాలుండవే అందాల జవ్వని!!
రచన- సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్( చురకశ్రీ) కావలి.