అదివో అల్లదివో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి పాదపద్మముల చెంత! ప్రకృతికి ఆలవాలమైన ముంగమూరు పల్లె నందున్ చింతలు ఎరుగని టంగుటూరి అభిజనమున!! రామమూర్తి (విష్ణు మూర్తి), సుబ్బమ్మ ( శివస్వరూప) పుణ్య జననీజనకులకు ప్రభాతవేళ అరుణోదయ శుభ ముహూర్త సమయాన!
తేజోమయి వజ్రకాంతులతో ప్రకాషితమై ముద్దుగొల్పే ముంగమూరు ముద్దుల "ఆత్మజుడు," !!
ఆ ఇంట 08-12-1960 న ద్వితీయ సంతానమై !
విష్ణు, శివనామ సమ్మేళనం తో వెంకట మల్లికార్జున నాగేంద్ర ప్రకాష్ రావు అనే నామకరణం చేసే ఆ దంపతుల్ !!
ముద్దు ముచ్చట్లతో అల్లారుముద్దుగా ఆడుతూ పాడుతూ తిరిగియాడుతూ!
తండ్రి ఉపాధ్యాయ వృత్తి పాలనలో!! తల్లి సుగుణాలు తెలివితేటలతో చనువు,గారాబం ఆలానలో!!
శ్రీ వాణి కరుణాకటాక్షాలతో అద్వితీయ జ్ఞానసంపన్నలతోన్ ! యం.ఏ,బియిడివిద్యను అభ్యసించే బోగోలు ( బిట్రగుంట) బుల్లోడు !!
బుల్లెట్ లాగా కావలి కి చేరి కళ్ళుగోళ్ళం సన్నిధిలో పాత్రికేయుడిగా చేస్తూ!
అమ్మనాన్న దీవెనలతో! సరస్వతీ ,పార్వతీ, శ్రీ లక్ష్మీ లాంటి ముగ్గురు అక్కచెల్లెళ్ళ మనోఫల ఆశల ఫలఫలితంగా!!
లక్ష్మణుడు లాంటి తమ్ముడు హనుమంతరావు ప్రేమాను బంధం! జయవిజయాలతో సంపూర్ణ అందచందాల కుందనపుబొమ్మ; జయశ్రీ పరిణయం ఆడ ఆవిడ జ్ఞాన సముపార్జన అమితభక్తి శ్రద్ధలతో !! కుటుంబ మైత్రి బంధంతో;
సంఘమిత్ర ఎయిడెడ్ విద్యాలయంన 1991 ఉపాధ్యాయ వృత్తిని చేపట్టే!
దినాభివృద్ధి చెంది 2011 నుంచి ప్రధానోపాధ్యాయులుగా ముప్పది వత్సరాలు గావించెన్!!
తుదకు శ్రీ శారదా పీఠ విద్యాలయంన నందనవనం సమక్షంలో పదవీ విరమణ 31-12-2020 న చేయుచుండే!! ఈ విజ్ఞానఘన స్వరూపుడు!!
ఇంతడు వృత్తిని గురుతర బాధ్యతగానే గాక అంకితభావంతో డన్!
సహచర గురువులతో అత్యంత ఆప్తులుగా భావించే అందరిలో ప్రకాషిత ప్రకాష్ గా! శెభాష్ గా!! మెలిగే!!
వృత్తి నే కాక పలు జనహిత చైతన్య కార్యంబుల్ చేపట్టే ;
అందరిచే భేష్ భేష్ అని అభినందనలు పొందే !
వీరి శిష్యులు పైపైకి ఎదిగి ఉన్నతశిఖరాలు చేరెన్ అందరిచే సంఘ మిత్రప్రకాష్ అనే పిలుపుపొందెన్!!
వీరు జనవిజ్ఞానవేదిక అంటే ప్రకాష్,ప్రకాష్ అంటే జనవిజ్ఞానవేదిక!రచయితగా ,వార్తా కాలమిస్టుగా, తెలుగు భాషోద్యమ సమితి క్రియాశీలక సభ్యుడుగా,;
బాలవిజ్ఞానసాహిత్యవేదిక సంస్థ పౌండర్ గా,రామ్ సెంటర్ సభ్యులు గా;
ఇంత ఏలా? అల్ రౌండర్ గా టంగుటూరి ప్రకాశ్ !
వీరు చేసిన విద్యాసేవలకు 2007 న జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు; సమాజ హిత కార్యక్రమాలకు గుర్తింపుగా2011 న జిల్లా కలెక్టర్ వారిచే ఉత్తమ సేవా రివార్డు!
ఒకటి ఏమిటి అన్నిచోట్లా ఈయనదే రికార్డ్!!
ఈయనలో ద్వినామాల సంపర్కం వల్ల శ్రీ విష్ణువు సహనం, సమయస్ఫూర్తి చిరుమందహాస్యం,
శివుని భోళాతనం కాస్తంత రౌద్రం!!
తెలివిలేకకాదు, తెలియకకాదు! మంచితనమే !!
ఎదుటివారి పట్ల జాలి కరుణే అదే ప్రకాష్!! అంటే అందుకే మాకంటే ఇష్టం ప్రకాష్ !!
అదే ఆయనకు ఇరవై ఇరవై లో అరవై నిండిన ఆయన ట్వంటే !!!
ఆయన శతవత్సరాలు నిండుగా జయప్రకాష్ ల్ ఆరోగ్య ఐశ్వర్యాన్ని వారి వంశ ఇష్టదైవులైన శ్రీ మహావిష్ణువు, పరమేశ్వరులు !
వారిని వారి కుటుంబాన్ని ఎల్లవేళలా వెన్నంటి కాపాడాలని ;మనశ్చావాచ్ఛా కోరుతూ !
హృదయ పూర్వకంగా ప్రేమతో పదవీ విరమణ సన్మాన పత్రం
ప్రియ మిత్రుడు
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ) కావలి.