పసందైన పేరు ఇరవై ఇరవై;
సంబరాలతో స్వాగతం !
కాస్తంత కాలం గడిచిందో లేదో
పుట్టిందో పుట్టించరో;
సమస్తం అలుముకుంది కానరాని రక్కసి కోవిడ్ -19(కరోనా) !
జనాల గుండెల్లో దడదడ;ఇంట ఇంటా బెడద!!
జంట జంటగా ఉండలేక గజగజ!
పారద్రోలడానికి పళ్ళేలతో ఫైటింగ్,చప్పట్లు, డప్పులు, దీపాలపెట్టుడు!!
ఈ ఆటలు తాటాకు చప్పుడ్లు
పనిపాటలేక,పండగపబ్బాలు జరపుకోలేక!
సోమరితనం చేరువై,బతుకు భారమై,ఆదాయం లేక!!ఉన్నది అంతా ఖాళీ!!!
కాలక్షేపాలు లేక చీకుచింతలు మెండై;
మమతానుబంధాలు మాయమై!
పలకరింపులు లేక ఒంటరితనం లీలమై!!
మనిషికి మనశ్శాంతి లేక మోడై;
తనవారి ఆఖరి గడియలు చూడలేక!ఎత్తుబడులకు పోలేక!!
ఆర్తనాదాలు చూడలేక! అవమానాలు పడలేక!!
అంటరానితనంతో తనలో తాను ఉండిపోయికాలం గాయాల మయమై!
కంట కన్నీరు వరదలై;
లోకం చీకటి వలయమై!!
పడరానిపాట్లు పడి సుఖసంతోషాలకు దూరమైశాంతి కరువై! దిక్కుతోచక
తమవంతు నుండి రక్షణకై తపనతో అల్లాడిపోయె ఈ కలి మనిషి!!
బడిపిల్లల చదువు సంధ్యలు సట్టుబండలై ఆగే జ్ఞాన జ్యోతులు ఆగిపోయె!
ఆకలి కేకలు, వలసల పరుగులు దిక్కుతోచక తికమకలు!!
అయిన మనిషి లోని సాయత బయటపడే! చిన్న దాతలనుంచి సోనుసూద్ వరకు ,గరీబ్ నుంచి జాగీరుదారు వరకు పరుగులతో ఆసరా ఇచ్చే!!
పారిశుధ్దకార్మికులు, పోలీసు, అధికార యంత్రాంగం, స్వచ్ఛంద సేవకులు చేయూత ఇచ్చే చివరాఖరుకు మందగించే కరోనా !అయిన భయం భయం వదలకచచ్చే!!
ఓ కలిరక్కసి ఇప్పటికైనా "కలిని" వదిలి వెళ్ళూ! మరలరాకూ !!
నే నిన్ను నిందమోపను; నీ తప్పు లేదు; నే ఎలా స్వాగతం చేశానో! అంతే ఆనందంగా" వీడ్కోలు" పలుకుతాను !!
ట్వంటీ ట్వంటీ చివరి క్షణం చీకులు చింతలు సంపూర్ణంగా వదిలి వెళ్ళూ!
నీవు వెళ్ళుతు వెళ్ళుతూ మా సమస్త బాధలను నీ వెంటే తోలుకుని వెళ్ళు!!ఇరవై ఇరువదిఒకటికి అంటించకే నా అపూర్వక ట్వంటీ ట్వంటీ !!!నీకు ఇదే మహా వేడుకోలు!!!!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ) కావలి.