అరె అరే బడన్నపల్లె కన్యపిల్లా;
అరె అరె అరే ధర్మవరం పట్టణ పడుచు;
అరె అరే అనంతపురం దళిత ఆడబిడ్డ!
అభము శుభం తెలియని అమాయక ఆడ అమ్ముడు!!
నీకు నచ్చలేదనో,
నిన్ను మెచ్చలేదనో,
నీకు ఎక్కడో గుర్చుకుందనో,
సజీవ దహనం చేస్తావా చచ్చినాడో!
ఓ సాధించావురా? సచ్చువెధవ;
మగజాతికే మచ్చతెచ్చినాడో
నీవు భూమికే భారంరా సన్యాసి!!
పరం భక్తసన్యాసులే తలదించుకున్నారు కదరా! రాక్షసుడా!!
అమాయక అబలల పై నీ వీర ప్రతాపం;
నీరసపు ఛండాలపు దరిద్ర విలాసమా;
ఓరి నీచ్ కమ్మినే కుత్తే నిన్ను నీకు ఊతం ఇచ్చిన వారికి అలాగే చేస్తే !
సమసమాజానికి నచ్చుతుందిరా ఓరి! మూర్ఘుడా!!
నిర్భయ్,దిశ,దాని అబ్బలాంటి చట్టాలున్న ;
ఒంటరి ,బలహీనమైన వర్గాల పట్ల ఈ పైడి వెధవులకు! వరాల ముట్టేనా?
పసిబిడ్డను పడుచుపిల్లను,కాటికిపోయే పండు ముదసలిని వదలక పోతుండే? ఇలాంటి నీచ నికృష్టుల్
చూస్తూఉంటే తుంటరి పనికానే కాదు; పనిగట్టుకొని చేస్తివి కదరా పాపిష్ఠి!
ఇదిఏమైనా ఈరాముష్టి ఈడి పేరేమిటి అనుకుంటివా?కచ్చరా( చెత్త )నాయాలా !!
ఇలా ఏదో జరుగుతుందని జరగబోతుందని మనసున తట్టి ;
రక్షించండి, కాపాడండి ,వెతకండి అంటూ రక్షకభటశాల చూటుతా తిరిగితే;
పోలీసు ఈ గలీసును ఆపలేకపోయే ఓ! బంగారం !!
వీరి సింగారం బజారు కేనా?లేక పెత్తందారికేనా? ఏలికల రక్షకేనా??
నీ పై జరిగిన ఘోరకలిని ఆపలేకపోయే;
ఓ స్నేహలత నీకు జరిగింది ఘోరం; వారి పాపం పండి పుండై పురుగులు పట్టి చచ్చున్ !?
ఇదే ఆ నీచులకు చురకశ్రీ ఇచ్చే శాపమ్!!
నీ పవిత్ర ఆత్మ పరిశుద్ధమగులే; లతా! ఓ! స్నేహలత!!!
రచన...సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి.