చక్కదనాలు అద్దిన అందాల సొగసిరి;
పకపకనవ్వుల రాగాల సింగారి రాణి !
ఊయలలో ఊగే చేమంతి పూవ్వ!!
పాలనురుగుల పూ బంతి;
నాలో లీలమై నన్నే పలకరించే పల్లవి!
గాలి అలలలో గలగలలాడే గాజుల గజాల!!
చిలిపికన్ను సైగాల తాకిడితో నన్ను ఆరాటపెట్టకే ఓ చిత్రాంగి!
నన్ను అలా ఊరించకే నే ఆగలేనే ఊర్వశి!!
ముసిముసి నవ్వులు హరివిల్లులా విసిరే గువ్వ !
నన్ను ఇలా ఉడికించకే చందనాల సుగంధ చిలిపి చిలుక !!
నీ ఊపుల చూపులతో నే తాలలేనే
సరసపు సొగసైన సిరి మువ్వ !
నీవు అలా ఊగుతుంటే నా మది
గతితప్పి;
జలధరిస్తూందే ఓ! జాణ!! ఓ యీ ! నెరజాణ!!
నీవు అల ఇలా కవ్విస్తూ ఉంటే ;
నా యద జారి! నీ యదపై చేరుతుందే;
ఓ! నా సీతాకోకచిలుక!!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి.