అలంత దూరాన ఉన్న నీవు నా చెంతనే ఉన్నట్లు ఉంది బావ !
నీవు నాకు ప్రేమతో తొడిగిన ముద్రిక (అంగుళికం ) అనుక్షణం గమనం చేస్తుంది మామ !!
నీవు నా మెడన కట్టిన తాళిబొట్టు నా యద పై హత్తుకుని ఒత్తుకొని !
నీ యడబాటుతో తట్టి దడ పుట్టిస్తుంది నా హృదయ రాజా !!
నా నుదుటి మీద అద్దిన సింధురం ; నిగనిగలాడి నీవు వస్తావు అని అద్దం పలుకుతుంది ! నన్ను ఏలే నా ఏలికా!!
నీకు ఇష్టమైన నీలి ఆకాశం వర్ణ చీరతో,
పుడమివర్ణ పైటచెంగుతో సింధురపు రవిక కట్టుతో !
తొలినాళ్ళలో వాకిట నే నీకోసమే ఎదురు చూస్తున్నట్లు ;
ఇప్పుడు ఉబలాటగా ఉంది నా మదిన, గదిన కూర్చొని!
నీ బాహువులు నా తనువును చుట్టేసిన మధురమైన స్మృతులతో!
నన్ను నేను గట్టిగా పెనవేసుకొన్నట్లు ఉంది ఓ ప్రియ మనసా !!
నా వడిలో తల వాల్చి నా పెదాలను తాకిన ; నా ఒళ్ళు పులకరించిన జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి బావా !
తెలిసో !తెలియకో !! నే వాడిన చిలిపి మాటలు నీ హృదయాన్ని గుచ్చుకున్న గాయాలు అయి !
నీవు అలా నొచ్చుకుంటే ఎలా? మామ! ఇచ్చిపుచ్చు కున్నప్పుడు చప్పుడు చేయకుండా సర్దుకుందాం రా !బావా !!
ఇక నేను ఒంటరి ఏకాంతాన్ని భరించలేను ; నీ కాంతను దరిచేర రా ! మామ !!
నీకోసమే నా తనువు నా మనసు తబ్బిఉబ్బి అవుతుంది బావా !రా! బావా!!
ఇక అలక వీడు నా పిలుపుతో గతాన్ని మరచి నా చెంతచేరు నా ముద్దుల మామ! రా! రా!! రమ్మంటే?
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ) కావలి.