రెండు అక్షరాలు
రెండు చూపులు
రెండు మనసులు
రెండు వయసులు
రెండు హృదయాలు!
రెండు స్పందనలు
రెండు తపనలు
రెండు ఆలోచనలు
రెండు ఆకర్షణలు
రెండు శ్వాసలు
రెండు విరహాలు
రెండు శరీరాలు
రెండు గుండె చప్పుడ్లు!!
ఒకే చూపుల కలయికై గిలిగింతలు చేస్తూ
ఒకే మనసు కోవెల లో నిలయమై ఆరాటపడుతూ!
ఒకే వయస్సు గా మారి ఒదిగిపోయి చిందులు తొక్కుతూ
ఒకే హృదయ అంతర్లీనమై అంతరమధనంతో
ఒకే స్పందనగా మది గనిలో నాట్యం చేస్తూ!!
ఒకే తపనతో తాపమై వేదనభరిత సంగమం లో
ఒకే భావన ఆలోచనలై అలల తాకిడికి కితకితలై!
ఒకే బంధన ఆకర్షణలో కలకాలం నిలిచిపోయే జ్ఞాపకాల పుస్తకమై
ఒకే ఉమ్మడి శ్వాసలో శ్వాసగా నిలిచి ఊపిరినై!!
ఒకే విరహ వేదనల తలంపు తొలిగి తొలకరి జల్లు కురియాలని
ఒకే ఒక శరీర నాదస్వర కల్పనలతో కఠినమైన ,జటిలమైన కుటీర కుహరం లో దాగిపోవాలని!
జంట గుండె చప్పుడ్లు గంటలు సదా సర్వదా
ఒకే పిలుపు కొరకై ఎదురు చూపులతో తహతహలాడుతూ పరుగులు వేసే రెండే రెండు అక్షరాలు ఎదురు చూస్తున్న "ప్రేమ" నీకు స్వాగతం సుస్వాగతం!!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి.