తిండి తిప్పలు మాని ఎల్లవేళలా పనికిరాని పనుల జోలికి పోమాకు!
కంటికి కునుకు లేక ఎల్లప్పుడూ చేతకాని చెత్తవాటిని చూడ మాకు!!
నోటి అదుపు లేని వేళాకోళపు మాటలు ఆడమాకు!
చూసే వారికి, వినే వారికి అలుసు అయిపోతావు ధరణి నందున్!!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!
---------------------------------------
తిండికి గతిలేని వాడిని చూసి అవహేళన చేయకు!
ఉన్నవాడిని చూసి ఎగిరి ఎగిరి వంగి వంగి బడాయి చేయకు!!
ఎవడు ఎప్పుడు ఎలా మారునో,చేయి చాచినవాడు దాన పరుడు అగు!
దానపరుడు ఇచ్చిఇచ్చి బికారి అగు ఇది నిక్కం!!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!
----------------------------------------
పాడిదూడల నోటి దగ్గర పాలు తీసి ,పసిపాపల పోషక పాలను మరచి!
కలిలో అనాధల ఆకలి అగచాట్లు గాంచి పట్టనట్లు నటించే నట్టు లూజు మహానుభావులు!! రాతిరూపదేవులకు ,రాతిరూప ఖ్యాతి జాతినేతలకు పాలాభిషేకాలు !
ఎవరు చెప్పినారయ్యా వారిని వదలి మాకు చేయమని నవ్విపోదురు!!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!
-----------------------------------------
నోటు ముందు మాట రాకపోయే
మనస్సు మారి చేయి జారిపోయే!
మాటవచ్చినోడు( విద్యావంతుడు) బయటే మాట్లాడే బూతు దాకా పోకపోయే!!
మరి సరైన ఓటు పడకపోయే నోటు ముందు ఓటు ఓడిపోయే!
విలువలు పాతాళానికి దిగజారిపోయే ఇక్కడే కాదు ఎక్కడ చూసినా ఇదే గోల అయే!!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!
------------------------------------------
జానెడు పొట్ట కోసం బారెడు దూరం ఏపుగా కట్టెల మోపు !
సంకలో అంటిన సంటిబిడ్డ పాల అమృతం గుంజు!
ఇంటి కాడ కూడు కోసం బిడ్డలు, అత్తమామల పడిగాపులు!
అమ్ముడైతే పూట ద్రోలు,ఈ అమ్మడు ఫీట్లు చెల్లు !
ఇంకా అవనిలో ఇలా బతుకు వెతలు ఎన్నో !!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!