నా మనస్సు నిన్నే ఎప్పుడు ఎన్నటికీ వెన్నంటి ఉంటుంది
నా మనస్సు నీ మోహన రూపాన్ని కోరుకుంటుంది
కంటికి నీ రూపం అపురూపంగా పసందైపోయింది
నీవు నా ఎదుట లేకున్నా మరువకు అంటూ పదే పదే తట్టితట్టి గట్టిగా చెబుతుంది
కన్ను మూసిన నీవే తెరిచిన నీవే అంటూ రెప రెప లాడిస్తూ గోల గోల చేస్తున్నాయి
నా మది నీవే నీవే అంటూ నాకు నీవు, నీకు నేనే అంటూ ముచ్చట పడుతుంది
నీ మదిలో నన్ను దూరి పొమ్మంటుంది చిరకాలం ఉండి పొమ్మంటుంది నన్ను
నాకు నీవు నీకు నేను చెరి సగం లా శివ పార్వతుల జంట కమ్మంటుంది
నే ఎటు నిలబడిన ,ఎటు ఉన్న నీ ధ్యాసే అయింది
నా ఎద పై భారం విపరీతమై
నీతోనే నా పయనం అని
నా హృదయం లాగేస్తుంది
అంతలా నచ్చావు నీవు ,
నీవు లేక ఇక ఒక క్షణం కూడా ఉండలేను, తక్షణమే నీ ఎదపై వాలిపోవాలని ఉంది బావా! నీవు రావా! !
నీవే నా సర్వస్వం బావా! నిజం బావా వచ్చేయి బావా!!
కళ్ళు కాయలు కాస్తున్నాయి,మనస్సు ఉవ్వెత్తున ఉవ్విళ్లు ఊరుతుంది బావా!
నా మనసంత నీవే నిండుగా పదిలమై వెచ్చగా ఉన్నావు బావా! రావా!!
రచన.సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ)కావలి.