సత్తు మట్టిన పుట్టి రాళ్ళ మధ్య దాగిన ఘణమైన వజ్రాలు రంగు రంగు కాంతులతో ధగధగలాడు;
పరికించి చూడచూడ పిరికివారి వలయాన భగభగలాడే అగ్ని కణధారుడు ఉదయించి ఉండు
వాడితోడ ఆ జనాలకు ఆసరా!
సమ్మెట దెబ్బలకు ఇనుము పదునైన ఆయుధం అగున్;అదే అవసరానికి పనికి వచ్చున్!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!
---------------------------------------------------------------
బద్ద విరోధులైన కాసింత అణుకువగా మెల్ల మెల్లగా మెలిగిన చెలిమిగా మారున్!
అశుద్ధమైన పనులు నెమ్మ నెమ్మదిగా మానిన పరిశుద్ధ పరుడుగా మారడా ధరణి న్!!
జాతి వైర్యం మరచిన నీ కీర్తి, నీ ఖ్యాతి అఖండ జ్యోతిగా మారదా ఓ నారదా!
చాడీ మాటలు, తిక్కచేష్టలు మానిన పోరుబాట పోదా!!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!
-----------------------------------------------------------------------------
నీకు నచ్చేవి నాకు నచ్చాలని ,నాకు నచ్చేవి నీకు నచ్చాలని ఏముంది?
నీకు ,నాకు నచ్చకపోయినా పర్వాలేదు ఎదుట ఉన్న వారికి ఎబ్బెట్టుగా ఉండకపోతే అదే సంతోషం!
దానికోసమైన సంతసపు పనులు చేసిన చాలు అవే నీకు,నాకు పదివేలు!!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!
-------------------------------------------------
పుట్టేడు దుఖఃం చాటున ఘాటైన వేదన దాగి ఉండు;
పట్టేడు మెతుకుల మాటున బండెడు కష్టం దాగి ఉండు;
కష్టసుఖాల,లాభనష్టాల మాటున అలవికాని/ చెప్పలేని తిప్పలుండు!!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!
--------------------------------------------------
చీకటిని ఛేదిస్తే వెలుగు ప్రకాశించు;
అజ్ఞానాన్ని ఖండిస్తే జ్ఞానం ఉదయించు!
అన్యాయాన్ని ఎదిరిస్తే న్యాయం జయించు;
అసత్యాన్ని ప్రశ్నిస్తే సత్యం ఉద్భవించు!!
అధర్మాన్ని నిలదీస్తే ధర్మం కానవచ్చు;!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!