నేల వాలిన పూలు బహుళ సువాసన పరిమళాలు చెందు; వాడి
నేల జారిన పూలు కాసింత పరిమళాన్ని అంటుకున్న దారానికి అంటించి వెళ్ళు
ధరిత్రి నందు మంచి కోరు బహుళ జనులు అరుదుగా ఉండు; పరిమిత
సాదుజనులు వెళ్ళుతూ వెళ్ళుతూ సార్ధకమైన కార్యంబులు చేసేదర్
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!
------------------------------------------------------------------
దొర నందు దొరకని దొరతనం, దొంగ నందు గాంచు అది ఎట్లన్నన్!
దొర పేదవాడి ఇల్లు, వొల్లు గుల్లచేయు మరి, దొంగ దొరల ఇంటే గుల్లచేయు!!
పరికించి చూడ దొడ్డ సమయాన పనికిరాని పండితుడు;
లోకజ్ఞాన పరుడు ఘనుడు కదరా ధరిత్రి నందున్!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!
---------------------------------------------------------------
అవకాశం ఉంటే అవసరానికి ఆకాశాన్ని కిందకు దించు
మతి ఉన్న మనిషి తన కోసం ఏమైనా చేయగలడు
అది ఎట్లన్నన్! దాహంతో కాకి కుండలో గులకరాళ్ళు వేయలేదా? కోతి చిటారు కొమ్మ వంచదా?
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!
---------------------------------------------------------
వెలిగిపోతున్న దేశప్రగతికి ఇదొక మచ్చుకైనా ప్రతీకలు;
కొన ఊపిరితో అల్లాడి పోతున్న జనాలకు ఒకే వేదికలు!
ఎవరైనా అడిగినారా? సోమరితనపు ఉచితాలు;
మరిఎవరైనా కోరినారా? ఉన్నతాగ్ర విగ్రహాలు!!
జన ప్రాణాలకు ఉద్దీపన మేళాలు, సరైన బహుమతులు!
అవే చేయలేకుంటే వల్లకాడు స్వాగతపు జాతరే!!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!
----------------------------------------------------
గురువుల ప్రాణాలు గాలిలో దీపాలు లా రెపరెపలాడ
రోజు రోజుకు మరణాల పోటీ రెట్టింపు కాసాగే
చదువుతున్న బాలబాలికలు బిక్కుబిక్కు మంటుచుండె
వారిలోను కరోనా రెట్టించిన వేగంతో పరగెత్తసాగె
సెకండ్ వేవ్ లో బలి అవుతున్న బడిపంతులు
వీధిపాలగు చుండే కుటుంబాలు, చదువు సంగతి దేవుడెరుగు రేపటి రోజు నాది కాకపోతే చాలు దేవా! అన్నంటూ ఉండే
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!