కడలి అలల కదలికల ఒరవడి తో నాజూకైన సాగరపు సౌందర్య రాశి!
ఆరుబయట పడి తన సాగర రమణీయ అందాలను చూచి;
ఇసుక తెనుల్లో ముచ్చటగా అలల గాగ్ర చీర కట్టి!!
ప్రకృతిలో లీలమై సుందర స్వప్న మాలిక తనివితీరా విశాల సరదాలు ఆడి విసుగు చెందక
రాళ్ళగుట్టలపైతిరుగుఆడుతూ,పాడుతూ తన పరువపు అందచందాలు ఆరబోస్తూ!
ఎగసిపడే పాలనురుగుల అలలు!
తన ఎదలో పొందికగా ఒదిగిపోయి ఉన్న పాలపొంగుళ్ళులో గిలిగింతలు పెట్టే!!
వాటి దాటికి తనువు తహతహలాడే మనస్సులో ఎదో గుబులు గుబ్బగుబ్బలాడే!
కంటిచూపులు నలువైపులా వెదకసాగే; కంఠ స్వరంలో ఏవో ఏవో పలుకులు వరదలా పొంగసాగే!!
ఏవో ఏవో పిలుపులు; తన కర్ణభేరులకు ఇంపుగా! సొంపుగా!! వినబడసాగే!!
హృదయ అంతరంగంలో అనంత ఆనందాల తరంగాలు తాకిడి తట్టసాగే!
తనను ఎవరో వెంటాడుతూన్న భావన; తదేకంగా వీక్షణంగా చూస్తూ మైమరిచిపోతూ!!
సాగరం కన్నా భూలోక విలాసం! ఇంత వికాశవంతంగా,విలాసవంతంగా ఉంటుందా?
ఇంత లోక పరిమళాన్ని విడిచి పోలేను!! నన్ను వెంటాడే వాడు
నా కంట పడితే ఇక అతనితోనే నా పయనం అంటూ నా మనస్సు నిలదీస్తుంది!
ఇంతటి స్వచ్ఛమైన గాలి,స్వేచ్ఛా, ఇచ్ఛాపూర్వకమైన జీవనం,ప్రకృతి సంపద ఇంతవుంచుకొని;
నేను ఎలా?
ఉప్పునీటి సాగరంలో విహారించాలి? ఏది ఏమైనా నా ఆవాసం ఇక్కడే!!
నా వారసంపద భూలోక సమూహమే కాకుండా ఉంటుందా?
ఇంతలో తన వెనుక పిలుపు నీ సమయం మించిది ;
వచ్చేయి లేకుంటే చచ్చేవంటూ సాగరుడి హుకుం!!
ఇకచేసేది లేక కన్నీటితో ఉప్పు నీటిలో సల్లగా జారే!!
రచన.సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ) కావలి.