ఒకప్పుడు నిరసన పాలనకు అప్రతిష్ఠత;
మరిప్పుడు అది అవలీల విశిష్టత!
ఒకప్పుడు ఆందోళన అవహేళన;
మరిప్పుడు ఇదొక ఆనందహేళ!!
ఒకప్పుడు రాస్తారోఖో ఓ దిగ్బంధం;
మరిప్పుడు అదొక  వినోదం!
ఒకప్పుడు బంద్ దిగ్భ్రాంతి; ప్రభంజనం;
మరిప్పుడు అదొక విశాల  విశ్రాంతి!!
ఒకప్పుడు సమ్మె  భరించరాని అవమానం;
మరిప్పుడు అది తెలివితక్కువ తనం!!
ఒకప్పుడు నగ్న ప్రదర్శన  ఘోర విపత్తు/ నిదర్శనం;
మరిప్పుడు అది పరిహాస వికటాహాసం!
ఎంత చిత్రమో?విచిత్రమో? నాటి పాలనలో! నేటి ఏలిన
 ఘనత!!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!
--------------------------------------------------------------------------
పూత పూసే రాత ఉంటే మహీజం ఎన్ని శాఖలు గా చీలిన;
పిందెలు పుట్టి తట్టెడు కాయలు విరగకాయు!!
పూతరాని,పిందె పట్టని చెట్టు ఎన్ని వంపు సొంపులు తిరిగినా ఫలితం ఉన్నదా? 
కూతకు రానిదానికి ఎంత మేత వేసిన "పై కోతకు" వచ్చునా? మహీలో!!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!