తను వలచిన మదిని కన్నులు తనివితీరా గాంచి
ముసిముసి నవ్వులు వెదజల్లుతూ
ఆ హృదయ రూపకోమల కమలాక్షుడు
మనోహరమైన లీలారస సరస సుందరుడితో తన అలనాటి చిలిపి చేష్టలు, ముద్దు ముచ్చట్లు జ్ఞప్తికి చేసుకుంటూ ,
ఆ మధుర స్మృతులతో కలిగిన అనుభూతులను మన్ననం చేసుకుంటూ
తన ఎదలోతుల్లో మురిపియంగా, మనస్సు లో దాగిన ప్రేమ విరబూయగా
తన్మయత్వంతో తన తనువు గ్రీష్మ తాపం నొంద,
కంటి వెలగులు తేజోమయ అరుణవర్ణ ప్రకాషితమై మైకం కాగా ,
ముత్యాల వంటి పళ్ళు జిగెల్ జిగెల్ మనగా ,పెదాలు సరదాగా చిరునవ్వుతో స్వగతాలను స్వాగతాలు పలక ,
మనంబులోని మాట,పాటగా బయటపడి ఒళ్ళు ఆదమరచి అల్లరి చేస్తూ ఉంటే
తన పక్కన వలచిన చెలికాడు లేక విరహంగా
బాహుల్లో ఆ తైల వర్ణ చిత్రాన్ని బిగి కౌగలిలో కౌగలించుకుని పలకరిస్తూ గుండెలపై హత్తుకుంటూ ఉంటే
ఆ విరహపు దాహం మోహంతో సన్నగిల్లి పకపకనవ్వులతో మాయం మాయే
ఏకాంతంలో పకపకనవ్వుల కాంత మదిలో దాగిన/ దాచిన అంతరాలు ఇలా మటుమాయం అయ్యే.
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ)కావలి.