మనస్సు చిగురు తొడిగింది
వయసు చిందులేసింది
పరువం పరుగులు తీసింది
ఎద గుహ లో ఊహలు గుసగుసలాడాయి,
మది గని గమ్మత్తుగా ఊగిసలాట ఆడింది
కాస్తింత చెక్కిళ్లు సిగ్గు తో మొగ్గతొడిగాయి,
కంటి చూపులు మెల్లమెల్లగా రమ్మని సైగలు చేసాయి
పెదాలు సరదాగా చిలిపి నవ్వులు చేసాయి
ముత్యాల సరాల పళ్ళు తళతళలాడాయి
కమ్మని మృదువైన కంఠ స్వరం తడబడి కిసకిసలాడింది
శరీరం చల్లబడి నెమ్మది నెమ్మదిగా వేడై తోడుకోసం వెతకసాగింది
సరైన జోడి కోసం కోడి కూతకు వచ్చినట్లు ఎదురు చూస్తూ
ఒకటే ఆనందతాండవం చేసే పాదాలు,
నరాల్లో సత్తువ జివ్వుజివ్వు మంటూ విచిత్రమైన నాట్యం చేసే
ప్రేమ స్వేదంతో నేల తడిసి ముద్దగా మారి తన నుదుట సింధూర తిలకమాయే
తన ప్రేమ చిగుళ్ళు విరబూసి మల్లే చెండ్లు అయి శిగలో ఒదిగిపోయి
పెళ్ళి పందిరికి దారి ఏది అంటూ ఆశగా ఎదురు చూసే
ఆ ఆశ కోసం తన రెండు కళ్ళే వేలా కనుల కాంతులు వెదజల్లే
తన స్వప్న లోకాల సుందరుడు జగదేక ప్రియుడి రాక కోసమే ఈ చిన్నదాని ఆ కాక.
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి.