కోయిల కోయిలా వసంత కాలపు రాగాలు తీసే కోయిల
దగా పడిన కోయిల గొంతు మూగబోయింది
బాధ పడి
వెక్కివెక్కి ఏడ్చి కన్నీటి చుక్కల ధార ఉప్పొంగే
ఎదలో దాచుకున్న, పెంచుకున్న ప్రేమ ఎండమావి అని తేలిపోయాక
గుండె పగలి రక్తం మరిగి ఆవిరి అయి కన్నీటి జలపాత ప్రవాహమై ఎదపై పడి పడక మునుపే
వేగంగా జారి కాన రాని చోట చేరి చెల్లాచెదురై తాను మోసపోయానని!
తనను తానే మోసగించుకున్నాని!! అంతా తన కళ్ళెదుటే జరిగిపోయింది;
తానే అన్నింటికి కర్త,కర్మ,క్రియ అని తెలిసాక ;
తన మనస్సుకు తగిలిన మాయని గాయం,
తన హృదయపు ఆవేదనలను మాయం చేసే మందు రోదనలేనని; ఎర్రబారిన కంట రక్త కన్నీరు మున్నీరుగా జారుతుంటే!ఆపే శక్తి లేదు!!
మనస్సు గాయానికి పూసే పూతమందు ఎక్కడ ఉందో తెలియక
మధన పడుతూ ;
తనను తాను తిట్టుకుంటూ,సర్ధుకుంటూ,పొరబాటుకు ఇంత మూల్యమా?
సర్దుబాటు కోసం వేచి వేచి తనకోసం మరో వసంతం రాకపోతుందా? అమూల్యమైన జీవితంలో దిద్దుబాటు ఉండకపోతుందా?
ఆ తప్పు మాటిమాటికి చేయక
తన కన్నీటి వరద ఆగకపోదా? వేడి నిటూర్పు వదలి;
ఏదైనా సరే జరుగక మునుపే అడుగు వేయాలి జరిగినాక! నిందలు వేయటం,పడడం దేనికి? ప్రయోజనం ఏమిటి ?
మనం అనుకుంటాం అన్ని జరుగుతాయి అని ఏది జరగాలని ఉందో అదే జరుగుతుంది!
దేనిని ఆపలేం అడ్డుకట్ట వేయనులేం!! అలాగని తొందర పాటుతో అడుగు బురద మడుగులో వేయ రాదని
తెలిసే సరికి జరగరానిది! జరిగితీరుతుందని తెలిసేసరికి ఘోరం అయితీరుతుంది !!
అతి నమ్మకం ఉప్పు లాంటిది అది ఎక్కువ అయినా కష్టమే,అసలు లేకపోయినా ప్రమాదమే !
ఏ మాత్రం అప్రమత్తం లేకుంటే కడకు పచ్చని యవ్వన లోకం మాడి మసి;
అయినా ఇప్పటికీ మించిదిలేదు దిల్ పదిలం చేసుకుంటే ఖుషి! లేకుంటే అన్నీ మానుకుంటే ఋషి!!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి.