నీ మనసున నే దూరాలని ఉంది
నిన్ను చేరాలని ఉంది
నీ ఊహల్లో నేనే ఉండిపోవాలని
నీ తలంపుల్లో నేను నిలిచి పోవాలని
నీ వలపు చూపులు నాపైనే స్థిరమై ఉండిపోవాలని
నీ మది తలుపులు నా కోసమే తెరచి వేచి చూడాలని
నీ రూప లావణ్య సౌందర్యం నాకే సొంతం కావాలని నా ఆకాంక్ష
నీ గమనం నాతోనే పయనం అవ్వాలని తీరని కోరిక
నా స్వప్నాన్ని నీవే నిజం చేయాలని నీ ఎడబాటులో నేను క్షణం కూడా ఉండ లేనని నీకు తెలుసు
క్షణంక్షణం ఒక యుగంలా అనుక్షణం నిన్నే జపించే
నా హృదయాన్ని సంతసం చేసి శాంతిని బహుమతిగా ఇవ్వు
నీ చిరునవ్వులు నా మనస్సు లో కోటి దీపాల వెలుగులు విరజిమ్మే శక్తి నీలోనే దాగింది
ఆ శక్తి నాకే కావాలి అది నేనే అందుకోవాలి
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్( చురకశ్రీ )కావలి.