మనిషి ఒకచోట మనస్సు మరొకచోట విధి విసరే వింత నాటకమే
మనిషి ఆడే చిత్ర విచిత్ర వేషమే తనువులు రెండు కలిసిన విడదీయరాని బంధమే
మధ్యన దూరిన సంబంధం దూదిపింజంలా ఎగిరిపోవులే
కలకాలం నిలిచిపోయే బంధం ఆత్మబంధపు మాంగల్య బంధమే చెరగని ముద్ర వేయు
గత మమతల గురుతులు కలతలు తొలగించు ఆనందాల సంగమంలో తులతూగిన అవసరాలకు ఆ ఆనందాలు తెగిన గాలిపటాలే
మైకమో,మోహమో తెలుసుకునే లోపే జరిగే కష్టనష్టాలకు బలి అయ్యేది నీవే నిలకడలేని నీ ప్రేమ ఆరాటమే,సరస సరదాలు తాత్కాలిక విలాసాలే
ఇరువురు పంచుకునే అనుభూతులే శాశ్వత వికాస చిరునామే
జీవిత ఆటలో ఒక అల కల లా అలా చేరు
అదే ఒక అలజడి భయంకర జడి ఒకవేడి మరొకటి తడబడి చల్లబడి ఎప్పటికైనా ఏనాటికైనా వదలక తప్పదు
తప్పు తప్పే నీవు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా
అయినా తప్పదు అంటే అది నిన్ను కబళించక మానదు
ఆగిన, ఆరిన నీ వెంట నడిచే అడుగుల జాడ ఒకటే
రెండు నావల ప్రయాణం ప్రమాదమే భరించేశక్తి నీకు ఉన్న సహించే శక్తి లేదులే నీతో నడిచే వారికి
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్( చురకశ్రీ) కావలి.