చుక్క చుక్కా చుక్కల్లో చక్కని చుక్క
నీ అందాల మేనమామ చందమామ కోసం వెతికి వెతికి
తిరిగి తిరిగి మైనా ఎక్కి పెళ్ళి పందిరిలో వచ్చావా ఓ మైనా
ఆ అందాల నీ మామ ఈ సందడిలో ఏ మబ్బులు చాటున మాటువేసి దాచినవో
ఏ మబ్బు నిన్ను ఆటపట్టిస్తూ ముచ్చట ఆడు చున్నదో
లేక మరో ఆకాశ తార అసూయ చెంది అడ్డగించి తైతక్కలాడుచున్నదో
అనే సంశయం కించిత్ లేక నిబ్బరంగా, నిశ్చలంగా, నిశ్చయంగా,
నిస్సందేహంగా, నిర్భయంగా ఉన్నావు అంటే అదే
నీ సజీవ, సహజ ప్రేమ నీ ముద్దుల మామపై నమ్మకం మమేకం
మారకం లేని నీ కస్సుబుస్సులేని నిఖార్సు అయిన నీ అపూర్వ మోదం అదే మీ ఇద్దరి మధ్య ఆమోదం అయినా నీ కొంటె చూపుల ఊపుల తాకిడిని తట్టుకుని
మరొక తార వెంట పోలేడులే ఓ చక్కని చుక్క,పాతే ఆ ఊపిరి గిలగిలాడిపోదు
నీ ముఖ అరవిందం చూసాక రాకపోతే ఆ మనస్సు విలవిలలాడిపోదా
నీ వంపు సొంపులు నచ్చాక ఆ శరం గరంగరం కాదా
ఎటూ పోలేడు, పోయిన తట్టుకుని ఉండలేడులే
అందుకే నీ పెదాలపై చిరునవ్వుల సవ్వడులు మురిపెం గా నాట్యమాడుచుండే తార అందాల సితార
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి.