శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది ...శుభాకాంక్షలు
@@@@@@@@@@@@@@@
ఇంట తోరణాల స్వాగతాల సందడి!
ముంగిట ముచ్చటైన ముగ్గుల స్వాగత సంబరాల వరవడి!!
యుగయుగాల యుగాది ఊరు అంతా సందడి చేసే ఉగాది!
షడ్రుచులతో ఆరు ఋతువుల గుణగణాలను చూపే హైందవ స్థితిగతులను చాటే చైత్ర శుద్ధ పాడ్యమి పండుగ!!
తెలుగు వారి తొలి సంవత్సరాది సృష్టి కి వేడుకలను చాటే ఆది ఉగాది!
జాతకచక్రరాల ,నక్షత్రరాసుల గమన పుణ్య ఫలాలను,
లాభనష్టాల రాజపూజ్య,అవమానలను,శుభ,అశుభ పయనాలను పరిశీలించే యుగాది!!
పంచాగశ్రవణాలతో ,సరికొత్త ఆలోచన,వ్యూహాలతో!
ముందుకు దూసుకోబోయే పంచాగ శ్రవణ పర్వదినం!!
పవనదిశలతో సాగే ఆగే కాలం పూర్ణ ఆయుష్షు కోసం యజ్ఞ యాగాదులు జరుపుకున్నే పూజలతో పుణ్య ఫలాలతో;
ముందుకు పోయే తొలిసారి జరుపేఉత్సవం!
వేపపువ్వు పచ్చడి మంచి చెడులను బేరీజు వేసుకుంటూ;
మిత్రదర్శనం చేసుకుంటూ, ఇంట బయట ఆర్య/పెద్దలను ప్రసన్నం చేసుకుంటూ!
గోమాతకు భక్తిప్రభలతో గోపూజ చేసే పాడిపంటలకోసం;
ఏరువాక ఆచారాలు పాటించే పర్వదినం ఉగాది!!
జీవితంలో సకల కలలు, సమస్త కళలు నెరవేర్చుటకు ఇష్టపడే కోవెల కు పరుగులు తీసే కమ్మని రోజు యుగాది!!!
కీడు నీడలను వదలగొట్టే రక్షక ప్లవ పవనాలతో నీ రాక మాకెంతో శుభాల మయం!! ఓ ఉగాది!!!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ) కావలి .