పంచరంగుల పంచదార చిలుక! ఓ!! నా రంగు రంగుల సీతాకోకచిలుక ,
నిన్ను నే చూశాక ఫిదా అయ్యానే, నీ ముసి ముసి నవ్వుల అందాలకు దాసుడైయ్యానే !
ఓ అద్దాల మేడలో పూసిన మందారపు రాణి! నీవు సింగారంలా
సిగ్గులు వొలకబోస్తే నా మదిలో సితారవై ఉన్నవే! ఓ నయనతార !!
నీవు పడిపడి నవ్వే నవ్వులు హరివిల్లులా! విరబూసే ఓ ఆకాశపు పువ్వా!!
నా కోసమే ఆకాశపు వినువీధులు దాటి ఏకదాటిగా నా హృదయ గూటిలో చేరడానికి పయనించి;
నీ చేతి స్పర్శ నాకు సోకినే ముచ్చటగా మురిపియంగా ముద్దాడ!
నా గుండె దడ గడగడ లాడే నీ చేతి గాజుల గలగలు నాలోని కలతలను మాయం చేసి,
నా గాయాలకు పూత పూసే నాలో ప్రేమానుమమతల తలుపులు తెరిచే నీ మనస్సు నాపై మరలి నన్ను నీ ఎదపై వాల్చుకుంటివే వాలు జడల జవ్వని !!
నీవువస్తావని నాకు తెలుసు నా తోనే పయనిస్తావని ముందే తెలుసు;
నిన్ను నే మొదటసారి చూసాక నాకు తెలుసు;
నీవే నాకు సరిజోడి అని అందుకే నిన్ను నే వదలక పట్టుబడి నా దానిగా చేసుకుంటిన్ని ;
ఇక నా, నీ ల కలల పంట ఇంపుగా ఉండిపోదాం! జీవితాంతం
పసందైన జంటగా...
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్( చురకశ్రీ) కావలి.