ఇంత వేవ్ ఏమిటి? ఒకేసారి ఇంత రన్ ఏమిటి? ఎక్కడో ఒకచోట ఏదో తెలియని తిరకాసు
అదే దానికి ఆయువు అదే మానవళి అల్లకల్లోలపు ప్రాణపు పరుగులు
ఉధృతి ఉప్పెన గా మారటం ఏమిటో?
మరి అపర సంజీవని పనితీరు ఏమిటో
మరల ఈ భయానక పరుగుల యాత్ర ఏమిటి?
లక్ష్యం ఎరుగని ఒకే స్ధిరకక్ష్యలో(కాలంలో) గిరగిర మూవ్
జనాల అలజడి తరంగాలు వైద్యశాలల పంట
కట్టలు కట్టలేనివాడు వల్లకాడుకు టపాసులతో తనంతటతాను కావ్ కావ్ పయనం
ఆస్తిపాస్తులు వెంట రావ్ రావ్ ,ఆప్తులు నిన్ను కడసారి ముట్టుకోరు
ఆలుబిడ్డలు మొత్తుకుంటూన్న నిన్ను హత్తుకోరు
ఆదమరచితే
చాప కింద నీరులా,గాలిలో మంట సెగలా ,తుఫాను లోని గాలిలా సునామీ లోని నీటి మహా ఉప్పెన లా ,నమ్మించి పొడిచే ఘాటైన పోటులా చెల్లరేగిపోతుంది
ఈ కరోనా సైతాన్ నాద స్వరం వాయిస్తూ మరణ మృదంగం చేయగా, శవాల గుట్టలు సవాలు విసురుతూ నాట్యం చేస్తున్నాయి
ఆపటానికి మంత్రం, యంత్రం, తంత్రం ఒకటే స్వీయ నియంత్రణ
అదే ఆ సకల జీవి పోషకుడు,రక్షకుడు చూపుతున్న రక్షక కవచం
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి.