నాపేరు ప్రకృతి . ప్రకృతి అంటే సహజంగా ఏర్పడేది అని అర్థం . నేను చాలా అందంగా ఉంటానని అందరూ నన్ను ఆరాధిస్తారు . మీ వెంటే నేనుంటాను . నాలో వాతా వరణం , గాలి , నీరు , ధ్వని , నేల మొదలైన భాగాలున్నాయి . ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పుడు మీరు కరువు బారిన పడకుండా వ్యాధులు రాకుండా కాపాడుతూనే ఉనికిని నేను చాటుతాను . నాలో ఉన్న భాగాలు మలినమైతే నాలోని అందాలు నశించి జీవకో టికి , ప్రకృతి సమతుల్యతకు భంగం వాటిల్లి , అపార నష్టం కలుగుతుంది . ఈ నష్టాన్ని కలిగించేదెవరని నా భాగాలను ప్రశ్నిస్తున్నాను . జవాబు నాకు తెలుసు . అయినా చూద్దాం . అవి ఏం చెబుతాయో .
గాలి :
నేను కాదు , నేను కాదు . నేను సకల జీవరాశికి ప్రాణదాతనే కానీ నష్టంచేసే దాన్ని కాదు . ప్రకృ తియే నా శరీరం అలాంటప్పుడు నా శరీరాన్ని నేనెందుకు పాడు చేసుకుంటాను . నాలో ఆధునిక కాలపు నాగరికత వలన విషపూ రిత వాయువు చేరినందువలన , మలినాలు చేరుట వలన నేను కలుషితం అవుతున్నాను . నా దుస్థితికి కారణం మానవుడే . ఓ మానవులారా . నన్ను రక్షించండి . మీరు రక్షణ పొందండి .
నీరు : నేను కాదు . నేను కాదు . నేను మహా మంచిదాన్ని . నేను సకలజీవరాశికి , వృక్షాలకు , జీవం పోసే దాన్నే కానీ నష్టపరిచేదాన్ని కాను . నన్ను మానవులు అనేకరకాలుగా ఉపయోగించుకుంటున్నారు . నా వల్ల పంటలు పండుతాయి . కరెం టు తయారవుతుంది . ఇలా ఎన్నో రకాలుగా నన్ను ఉపయోగిస్తూనే మానవులు నన్ను అనేక రకాలుగా కలుషితం చేస్తున్నారు . అందువల న అనేక వ్యాధులకు , నష్టాలకు నేను కారణం అని అంటున్నారు . ఈ మాటలు విని , విని నా చెవులు తూట్లుపడుతున్నాయి . నేను ఏ పాపం ఎరుగను . దీనికంతటికీ కారణం ఈ మానవుడే . నేనుంటేనే ప్రకృతికి అందం వస్తుంది .
నేల :
నేనుకాదు , నేనుకాదు . నేను చాలా ఓర్పువంతురాలిని . ప్రకృతికి నేనే ఆధారాన్ని . మరి నా ఆధా రాన్ని నేను పోగొట్టుకుంటానా . నాపైనే కొండలు , కోనలు , నదులు , సముద్రాలు , చెట్లు ఉన్నారు . జంతువులు , పక్షులు ఇలా సకలం నాపైనే సంచరిస్తుంటాయి . గర్భంలో ఎన్నో అమూల్యమైన సంపదలు ఉన్నాయి . నన్ను మను షులు పొడిచి , చీల్చి , చెండాడి నా సంపదలు వినియోగించుకుంటూ విలాసవంతమైన కట్టడాలు , ప్రయా ణసౌకర్యాలు ఏర్పరచుకుంటు న్నాడు . వ్యవసాయవు వంట భూములను వేరే వ్యాపారపంట భూములుగా మారుస్తూ నాలోని సారాన్ని పీల్చేస్తున్నారు . నాపై రసాయనాలు వాడి , పురుగు మందులు వాడి నన్ను కలుషితం చేస్తున్నారు . నాపైన పనికిరాని దుర్గంధభరితమైన పదార్థాలు చల్లి నన్ను , నా అందాన్ని నాశనంచేస్తున్నారు . దీనివలితం మానవుడు అనుభవించక తప్పదు .
ధ్వని :
నేను కాదు , నేనుకాదు . నేను మంచిడాన్ని , నేనే లేకపోతే వినికిడి శక్తి ఉండదు . మానవుడే తన అవసరాల నిమిత్తం రకరకా లుగా ఉపయోగించుకుంటూ నన్ను అసహ్యించుకునేట్లు చేస్తున్నాడు . మానవుని విలాసవంతమైన అవసరాలకు వినియోగించుకుంటూనే మారణకాండకు కూడా ఉప యోగిస్తున్నాడు . మానవునిలో పరి వర్తన వస్తేనే నాకు పట్టిన కాలు ష్యం వదులుతుంది . ప్రకృతి ప్రశాంతత పొందుతుంది . మానవుడు : అవును నిజమే.నిజ మే . ప్రకృతి తల్లి ఒడిలో పెరిగిన నేను పుట్టుకతో మంచివాడినే . నా అవసరాల నిమిత్తం నా ఆనందం కోసం నేను ఇలా మారాను . ప్రకృతిమాతను నేను కలుషితం చేస్తూ నా ముందుతరాలను అంధకారం లోకి నెడ్తున్నాను . కరువుకాటకాలకు కారణం అవుతున్నాను . ఇకముందు ప్రకృతి రక్షణకోసం నా అలవాట్లను మార్చుకుంటాను . ప్రకృతి సమతుల్యతను కాపాడుతాను . భావితరాలకు ఆదర్శంగా నిలుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను . అందరి జవాబులు విన్న ప్రకృతి మాత సంతోషంగా తల ఊపి చూద్దాం . మానవుడు ఏంచేస్తాడో ' ఆలోచిస్తూ మరోసారి ' ఓ మానవు డా ! నన్ను కాపాడు , నిన్ను నీవు కాపాడుకో , నీ భావితరాలను కాపాడు ' అని హెచ్చరిస్తూ ముందుకు సాగింది .
-సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్
సోమవారం 24, మార్చి 2003 ( వార్త , మొగ్గ లో ప్రచురితం)