నేతచీర లేత అందచందాల సువాసన పరిమళాల సొగసరి
కలతలు లేని మేలైన కొలతల కనుపాపల సుందర మనోహరి
మమతానురాగాలు పంచే పసందైన మనోహర స్వప్న సుందరి
వయసు వయలు ఆరబోసి మనసులో చిద్విలాసమాడే గడుసరి
తను వలచిన నెలరాజు నిండు పండు వెన్నల రాకతో
మైమరచి కప్పుకున్న కొంగు జారి పూలగుత్తులతో స్వాగతాలు పలికే
మనసు ఉలికి జరదరించే రారమ్మని సన్నని స్వరం పలికే
పండు వెన్నెల కాంతి కిరణాలు తాకితాకగానే
మధుర స్వప్నాలు నిజసత్యాలు అయ్యే
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్( చురకశ్రీ )కావలి.