మనసులో ఉన్నప్పుడు నే నీ నుదుట బొట్టు పెట్టినా,
నీ పాదాల చెంత ముద్దు ఎట్డినా ఒకటే గా!
నీ యదలో నిండుగా ఉన్నప్పుడు క్రింద ఉన్న పైన ఉన్న ఒకటేగా!!
నీ ప్రేమలో పడి పండిన పండును నేను;
నీవు నా గులాబీ చెండువు; ఎండిన నా మదిని నింపిన నదివి నీవే!
నీ కోసం కలలు కని నా మనో గనిని నింపిన జవ్వని నీవే!! మనం ఇద్దరం
ఉన్నంతవరకు ;నీవు నేను విడిపోక సెలయేటి కొలను లా సాగిపోదాం!
నీ ,నా మధుర జ్ఞాపకాల దొంతరులే మన జీవనతరంగాల సరాగాలు!! ప్రియ సఖీ!!!
నిజమే!! ప్రేమేశ్వరా! కాదు అని నే ఎలా చెప్పగలను? చెప్పు;
నీవెచ్చట ముద్దుఎట్టిన నా ఒళ్లు జలదరించి నా మనో ఫలకం పులకరించి పోవు!
నీవు నా దగ్గర ఉంటే చాలు అది ఎక్కడ అనేది ముఖ్యమైనది కాదు!! ఎందుకంటే? నా మనంబు తన్మయత్వంతో సరిగమల సంగమం కలుగు!
నేను సైతం నీ కోసం ,నీరాక కోసం, నీ పిలుపు కోసం పరితపిస్తూ గడిపిన కాలం; ఇలాంటి శృతిలయల ప్రేమాభిషేకం కోసమే ప్రేమనాథా!!
నేను ఎలా మరువ గలను చెప్పు!
నా కలల ఋతుపవనాలు నీవు తెచ్చే,ఇచ్చే వసంతం కోసం వేచి ఉండుట కోసమే సఖుడా!!!
నీవే నాలో తరగని జలపాతాల ప్రేమ తరంగాలు నింపినావు!
అవే మన ఇద్దరిని కలిపి చెరగని గురుతులు చేసి
మరపురాని, మరువలేని జీవితానికి బలమై,
ముచ్చటైన జంటగా పండింట కాపురానికి ప్రేమాభిమానాలు లోకానికి
పసందుగా చాటుదాం!! నా ప్రాణానాథా!!!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి