పడగొట్టాలి అనుకుంటే పట్టు తప్పి పడకతప్పదు,
తోయబడి పట్టుతప్పిన  వారి జుట్టు పట్టుకోవడమో,
కాళ్ళు గుంజడంచేస్తే దిమ్మతిరిగి దొమ్మ పగులు కదరా!
అది ఎట్లా అన్నన్! తాడి తన్నేవాడు ఉంటే వాడి తలతన్నేవాడు 
ఎక్కడో ఒకండు ఉండు మహీనందున్!!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపు బాట!!
ఎంతటి బలవంతుడైన స్ధానం మారిన,స్ధాయి మారిపోవున్!
ఒకమందలోనిశునకాలైన,అడవికి రారాజులైన  మరో చోట బలహీనులే సుమా!!
దరికిచేరనీయవ్వుజాతిఒకటైన వైర్యము నందు వీరత్వం ఘనత నొందున్!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపు బాట!!
ఎదుటివారి చేష్టలు చూసి చూసి, గళంలో బలం పెరుగున్!
ఎల్లప్పుడూ ఒకటే  అనుకుంటే పొరబాటే!! 
స్వరాల వేడి సలసలా కాగి నడిరోడ్డున బతుకు జాతర చేసి పాతర వేయున్! 
కాలం ఎప్పుడూ ఏకరీతిగా ఉండకపోవచ్చున్!! 
ఉక్కపోయించి, ఉక్కుపాతర వేసి తుక్కుచేయున్!  
ఉప్పు,పప్పు,తప్పులు,హాస్యాలు మాసిపోయి!! 
నిప్పురవ్వలు ఎగసి ఎగసి నిప్పులు చిమ్ముతూ నిప్పు గవ్వలై ! 
శిరస్సున తాండవం చేసే నీ మదం అణచగలదు ఇదే తథ్యమ్!!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపు బాట!!