వందే భారత్ వందే భారత్ వందేభారతం!
వందేమాతరం అందరి గుండెల్లో రగులుతున్న నాదం! అదే అదే మా నినాదం!!
 
మూడు కడలి కూడలిలో నిలిచిన నా దేశం, 
ముచ్చటైన మూడు వర్ణాల మువ్వన్నెల జెండా అండన ,ధర్మచక్రం నీడన,ఏకజాతిగా ఏలుబడిన ఉండే  నా సువర్ణదేశం!
ఉత్తరాన నిలువెత్తు నిలిచిన హిమ మేరుపర్వతం పెట్టని గోడలా ,మణిమాణిక్యాల మట్టి తో జీవనదుల పరవళ్ళతో,జీవసాగరమైయే!!
పాడిపంటలతో తులతూగే నా ఈ దేశం!సకలసంపదలకు కొదువ లేనేలేదు,సమస్త జీవరాశులకు ఆలవాలం ఈ మనదేశం!!
ఎడారి అయినా కష్టించే పనితనపు ఘనత మనదే! సిరులు పండించి మెప్పించి తిరుగులేని భరతమాత ముద్దు బిడ్డలం! భవితకు ఆదర్శం మేమే,జగతికి స్ఫూర్తిదాయక ప్రధాతలం!! మేమే భారతీయులం!!
దానగుణంలోన ,నీతి నియమాలు లోన, విజ్ఞాన ఆర్జనలో,మనకు మనమే సాటి! మనకు రారు ఏ పోటీ!! అదే నా దేశ ఘనత,!!
కులాలు, మతాలు, భాషలు ఎన్నో ఉన్నా కలతలు లేని సామాజిక బాధ్యత పౌరులం! ఆపదలో తోడై నీడై ఆపద్భాందవులం!!
భావి భారతవిధాతలం ,శత్రువులతో పోరాడే ధీరులం!,పరాక్రమ శూరులం! భరతమాత బిడ్డలం! భరతమాత వీరులం!!
కరుడుగట్టిన ఉగ్రవాదైన,పరదేశీ అయిన నా దేశ గాలి నీరు,మట్టి వాసన పీల్చిన చాలు వాడి మనసు జల్లున జారు!!
 
వందే భారత్...వందే భారత్..మాతరం..
వందే..వందే ..వందేమాతరం... 
జై భారత్, జైజై భారత్..జై హింద్...
రచన...సయ్యద్. హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ) కావలి.