అనాదిగా నా అణగారిన వర్గాలను జాతి వైర్యం మహమ్మారి పురివిప్పి నాట్యం చేయ 
ఈకలాగ వెదజల్లే బిక్కుబిక్కు మంటూ మాన,ప్రాణాలు పోగొట్టుకున్న జాతిజనులారా! రండి!రండి!! రారండి!!! కదలిరండి!! భయపు నీడలు వీడి!పిడికిలి బిగించి పరుగులు తీయండి!! 
అడుగులకు మడుగులు ఒత్తిన జనులా! 
అందరిలా పుట్టుక ఒకటైన పుట్టెడు దుఖఃం  సొంతాస్తిలా అనుభవం, అస్తికలతో హస్తినాపురవాసులకు సేవలు చేసిన జాతి మనదిరా!! తమ్ముడూ!!! 
మంది మార్బలంఉన్న పైకి ఎదగలేక,ఎగరలేని రెక్కలు విర్చబడ ముక్కలైన దగాపడ్డ జాతి మనదే అన్నా!!! 
పలుగుపారలు పట్టి అరకలు దున్ని కాయకష్టంచేసి కట్టిక దారిద్ర్యం అనుభవిస్తూ బంగరు భవిష్యత్తు కోసం చూస్తూ, చూస్తూ గడిపిన మరుగునపడవేయబడ్డ జాతే మనది అమ్మలారా!!! 
ఇకనైనా మేలుక్కోండి అవే పలుగుపారలతో పరుగుపట్టండి చేతులెత్తండి అయ్యలారా!! 
చైతన్యవంతులై వెలివేసినవారినే వెలివేయగా రారండి!కదలిరండి!! 
అరె! అరే!! అక్షర ముక్కకు దూరమై లక్ష్యానికి బహుదూరమైన ఐక్యతతో ఇప్పటికైనా కలిసి రండి! 
అక్షర ముక్కతో శాసనకర్తలై,రాజకీయ వారసులై గద్దె ఎక్కి ఏలుదాం వచ్చేయండి  మిత్రులారా!!  
గతకాలపు చేదును మింగిన వారసురాలా మనలో దాగిన పిరికిని చదును చేద్దాం!! అణగద్రొక్కబడి,నొక్కబడి,త్రొక్కబడి, నెట్టబడి,వెంటాడబడి దొరల కాళ్ళకు మ్రొక్కిన చేతులు కలిపితే నరాల వేడి సలసలా కాగి జాతి జాగురత కాదా?? వేటాడి,కొట్టబడి,కట్టడిచేసి,కట్టేసి,పగబట్టిన వారిపై పైచేయి సాధిద్దాం చేయిచేయి కలిపి దుమ్ము లేపుదాం!! 
నాడు బడికి గుడికి దూరం, రాబడికోసం,కూడు,గుడ్డ,నీడలేక ఎండనక,వానానక ఆసరా కోసం ఎదురు చూపులు పడ్డాం సోదరా!!! 
మారుతున్న కాలం మార్పు కోరుకుందాం,అన్నింట ముందుకు సాగుదాం రండి! పిడికిలి బిగించి రారండి;దొమ్మ విరిచి కదనరంగంలో దూకుదాం రండి అక్కలారా!! పీడిత,తాడిత,దళిత జనాలు కదిలి జాతి ప్రేమను నింపుదాం!! 
జాతితో కలిసి రండి జాతి గౌరవాన్ని కాపాడగా కలిసి మెలిసి రా! రారా!! తారా స్ధాయిలో మనం ఉందాం రా!రారా!! రా....
రచన.సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్( చురకశ్రీ) కావలి.
ఒక మిత్రుని కోరిక పై పై నా రచన.