క్రింద చూసి నడుస్తున్న ఈ లోకం ఇలా కనిపిస్తుంది,
ఇక పైకి చూసి నడిస్తే ఎలా కనిపిస్తుందో? భయం వేస్తుంది; ఆందోళనగా ఉంది!ఎందుకనో!!నాకే ఇలా ఉందా? అందరిలోనూ ఇలాగే ఉంటుందా?
ఓ వైపున నవ్వుతూ, నవ్విస్తూ, కవ్విస్తూ కసరత్తు చేస్తుంది!
ప్రతి అడుగు ఆచి తూచి చేయాల్సిన అవసరం కానవస్తుంది
ఏమాత్రం తప్పటడుగు పడితే పిడుగు పడినట్లే
ప్రతి మాట వడకాచి పలకాలసిన ఆవశ్యకతలా ఉన్నట్టు ఉంది
ఏమాత్రం అటూఇటూ అయితే అపార్దాల మడుగు
ప్రతి చూపు కలుపుగోరు ,కాకపోతే అగ్గి సుడిగుండం
ప్రతి కదలిక మేలు కలయిక కానిచో రొచ్చు రచ్చబండ!
లోకం తీరు మారుతుందా? మనతీరు మారుతుందో?? తెలుసుకునేందుకు ప్రయత్నం చేసేలోపు ఏదోఒక అలజడి తరంగం !!
ఇదేనేమో మనిషి జీవిత జీవన పయనం !
నేను మారాలో, లోకం పోకడను మార్చుకోవాలో అంతు చిక్కని బేతాళప్రశ్నలా ఉంది !!
నా తీరు ఏ దారో తెలియని తికమక శిఖరం!!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్( చురకశ్రీ)కావలి.