రవ్వంత...అనుకో,అనంతం అనుకోకు;
అమితమైన ఆనందం దక్కదు/దొరకదు!
విర్రవీగకు విరిగిపోతావు,
అనిగి ఉండు అందలం ఎక్కుతావు!
తొందరపడి మాట జారకు అలుసైపోతావు!
శాంతంగా మాట పలుకు పరువుతో ప్రకాశించుతావు!!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపు బాట!
------------------------------------------
బిడ్డను మోయడం/ కనడం ఒకెత్తు;
బారెడు బాట దాట్టడం మరోఎత్తు!
రాకెట్ యుగం వచ్చిన ఇంకా వెనుకబాటే ఎందుకనో?
ఇకనైనా మార్చుదాం; జనాల వెతలు తీర్చడానికి బాటలు వేయండి!!భూపాలకా!!!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపు బాట!
--------------------------------------------
ఎగిరే గుర్రాలు కోరికలు! మనసు అనే కళ్ళేలతో ఆపకపోతే;
మనిషి పతనం!!
కదిలే ఆశలు ఆకాశం!ఆత్మనిబ్బరంతో కట్టడి;
మనిషి పయనం పాతళం!!
రగిలే ప్రతీకారాలు నీలినీడలు! అదుపులో ఉంచకపోతే; బంధనాలు తెగతెంపులు, ఒంటరై పోకతప్పదు! ధరణి నందున్!!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!
-----------------------------------------------------
వీధి గుమ్మాల అరుగులు కనుమరుగయ్యే, ధర్మసత్రాలు కరువు అయ్యే!
వెచ్చని రహదారులు నిద్ర పానుపులాయ్యే!!
ఏమి గతి పట్టే దీన జనులకు కలినందున్!!
రోడ్డు ఎక్కిన ప్రగతి చక్రాల ఆనవాలా? దివాలా తనమా?నిజమే చెప్పాలి!
ఆసరా కలిగించాలి, ఇలాంటివి ఆపాలి పాలకా!!!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపు బాట!
--------------------------------------------------
అవసరం అవకాశాల కోసం వెతుకు;అవకాశం అందుకోవడం బతుకుకోసమే!
బతుకు మెతుకు కోసం కాకూడదు! అలా ఐతే అది ముమ్మాటికి మోసమే !!!
మోసం జీవి పతనాల కోణమే! మొదలైతే అనంత వినాశాల విలాసమే!!!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపు బాట!!
----------------------------------------
ఒకదానికి ఒకటి అడ్డువచ్చింది అంటే అన్నింటికీ వస్తుంది అనికాదు!
ఒకదానికి ఏది అడ్డుపడలేదు అంటే అన్నింటికీ ఎప్పటికి రాదని కానేకాదు!!
ముసలం ఎలా, ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టం! మొసలి కన్నీటి లాంటిదే!!
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపు బాట!!
------------------------------------------
పక్కవాడిని ఎలా పిలిచిన నీకు వికటాట్టహాసము, మహాసరదా, హిట్టు !అదేమిటో!
అవే పలుకులంటే నీకు గిట్టవు!! అదే పెద్ద తిట్టు!! పౌరుషం ఉట్టిపడు!!;
కట్టు తెంచుకుంటే ఆనకట్టైనా తెగిపోదా?
అందుకే అంటారు!దేనికైనా ఓ హద్దుపద్దుఉండాలని;వింటారా?
వినరు,అదుపు చేయాలి, చేయించాలి లేకుంటే! పదువులు ఉన్నా లేకున్నా పరువులు పరుగులు తీయు!!!
ఇది చురకశ్రీ సూటిమాట!స్వర్ణకాంతిపుంజపు బాట!!