పది దినాల పండుగ పదిమందితో కలివిడిగా తిరిగి ఆనందాలు నిండుగా పంచుకునే అనుబంధాల మేళవింపు!
రోజు కొక వేషంతో అలరించే వినోద సంతోష సంబరాలు అంబరాన్ని తాకి గమ్మత్తుగా చిందులు, పలకరింపుల సరదాల దసరా!!
అందరికీ అది ఆసరా రాకపోకలతో మలిన పరదాలు తొలిగి నిర్మలమైన మనస్సులు పొంగే అనుభూతుల సరాగాల మా దసరా!! ఒకప్పుడు ఘనం!మరిప్పుడు తృణం!!పులివేషాలు,దశావతారాలు కనలేము!
బడిపిల్లలకు పప్పు బెల్లాలు కరువు!!బడిపంతులకు నూరువరహాలు అసలే లేవు!!! పై పై సరదాలే నేడు లోలోన మదనాలే !!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ) కావలి.
---------------------------------------------
విజయదశమి వేడుక...శుభాకాంక్షలు..మీ చురకశ్రీ.....
@@@@@@@@@@@@@@@@@@
చెడు, కీడు పీడ,పీడనలను అదరగొట్టి ఆనందాల నీడలో; ఆకాంక్షల పడగలో నవజీవన నావలో నడయాడే నూతన ఉత్సవ జీవితపు పరుగులు ఆశించే విజయవిహార సముదాయాల పరంపర!
వీర మహిళ వీరత్వానికి ప్రతీక! విజయాల సంహార తెగింపు వనితల తలరాతల మార్పుకు మార్గదర్శక చిహ్నపు సంకేతం!!
నవ వసంత సరదాల వరదకు "దసరా" !
అందరి మదిలో కదిలే ఆనందాల హేలా ;
చీకటి పై వెలుగు జాడల జయకేతన పడగ, !!
దుష్టులను చీల్చి చెండాడే ఆది పరాశక్తి అంశలో సాగే విశాల నేత్రాల విశాలాక్షి జయమే!! విజయదశమి!!!
విశ్వానికి అందించిన కానుక!!అదే మనందరి వేడుక!!!!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ) కావలి