"మాయా" చీకటి చీల్చుకొని పుట్టుకొచ్చి పుడమి పై పడ్డ పొత్తిళ్ళ బిడ్డ!
తల్లి చన్నుబాలు లాగి లాగి తాగి తాగి ఎదిగి రూపురేఖలు మారి ,వయసులో పడ్డాక !!తనే అందగాడని,తనను మించిన మొనగాడు లేనేలేడని;
తన తల్లి, చెల్లి,ఆలి ఒక ఆడదని మరచి;
మదం ఎక్కి,ఏ స్ధాయిలో ఉన్న మగాడు,మృగాడై,కీచకుడై,నీచుడై !
ఈ జీవుడు హీనుడై,పిచ్చి వాగుడుతో,సూటిపోటి మాటలతో; ఓరచూపులు,ద్వందార్ధాలతో,ఎత్తిపొడుస్తూ,కత్తెరచూపులు ఎక్కసెక్కాలతో పైత్యం ఎక్కిన గుంటనక్కలు,తుంటరివెధవలు !
రాత్రి పగలు,లేకుండా వెంటపడి సొల్లుకార్చుకునే సిగ్గుఎగ్గులేని ముండమోపి నాయాళ్ళు !!మనిషి రూపంలోని పశుజాతి చేసే వికృత చేష్టాలు,గలిసి పనులు చేసే గబ్బు నాయాళ్ళు!!!
బలిసిన డబ్బున్న,పెత్తనంచేసే పిశాసి నాయాళ్ళు!
ఎర్ర బస్సైనా,ఎయిర్బస్సైనా,అది ఆఫీసైనా,కాఫీ కేఫైనా ;
చోటు ఏదైనా జరిగే చేటు ఒకటే !!
ఈ కందిరీగల,తేనెటీగల దాడికి, తాకిడికి, రాపిడికి ఈ లేడి/ఆడ పిల్లలు విలవిలాడి తల్లడిల్లి ఢీలా పడిపోదురూ!! వనితల వెతలు , వీరే తిరగబడి నిలబడితే వీళ్ళ బతుకు బస్టాండే కదా!
ఎంతకాలం మౌనం,ఇంకెంతకాలం ఆరాచకం,అమానుషం పౌరుషంగా సివంగిలా లే! లేలే!! దెబ్బకొడితే బొబ్బ పడి చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలు కక్కాలి;
ఈతొక్కనాయాళ్ళు!!
ఆడది అంటే ఆట వస్తువు కాదురా,ఆడి పడవెయ్యడానికి అది అగ్గి పట్టుకుంటే,ముట్టుకుంటే బుగ్గి అని తెలియాలి !!వెధవలకు!
చూస్తే చస్తావని తెలిసేలా చేయి,ఆగకు,ఆపకు మదం ఎక్కినవాడిని ఒకసారి తొక్కిచూడు!!
నీ ఆవేశం వాడికి యమపాశం అయి యమపురికి రహదారి అవుతుంది!!
కదలు! కదం తొక్కుతూ మెదలు నిన్ను చూస్తే వాడి ఒళ్ళు వణుకు పుట్టాలి !
అలా ఉండాలి నీ చూపు,నీ ఊపు ఇక నీ ఓర్పు ఆప్పు!! అప్పుడే నీవు అసలసిసలైన పునీత వనితవు అమ్మా!!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ) కావలి.