వచ్చేయి రాకపోయే,
ఉండేవి తరలిపోతుండే! కుంటలోని నీరు ఇంకుతుండే,
కుండలో కూడు చేరకపోయే!
ఒంటి మీద బట్ట కుదురుగా ఉండకపోయే!!
పనిపాట లేకపోయే!
చేతిలో చిల్లిగవ్వ లేక/ రాకపోయే!!
చెమట చుక్కలు రాలకపోయే!దీర్ఘ వ్యాధులు పోకపోయే!! వానకాలంలో ఎండలు భగభగ మండుచుండే!
వర్తమానంలో ధరధరలు ధగధగ లాడుచుండే!!
భవిష్యత్తు పిల్లల చదువు సంధ్యలు సట్టుబండలు!
భూతకాలం ఎంతో ఘనం! వసంత మయం అని అనుకుంటూ!! సాగుతూ;
ఆగలేక గోరంతలు కొండంతలు చేసి;
కొంప కొల్లేరు చేసి; పుట్టేమునిగే చేతకాని తనమో,
నాకేంటి అనే భ్రమో!
కడకు అయోమయ భరితం!
ఇదే!! జరుగుతున్న చరిత!!!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ) కావలి.