ఏమి బంధాలో,
ఏమి అనురాగాలో,
ఏమి ఆత్మీయతలో,
ఏమి స్నేహాలో,,
కలవలేని కన్నులు
ఆదుకోని కరములు,
కదలికలు లేని కాళ్ళు,
అయ్యో అనని నరములేని నాలుకలు,
ఎందుకో ...ఎందుకో
కాటి దాకా రాలేని,సాగని మానవజీవి జీవితపు చివరి మజిలీ గజిబిజి అయ్యే,
విలువలకు కలి మరణాలు పాతరవేసే,
కులం వెంటరాలేదు,
ప్రాంతం తోడు ఇవ్వలేదు,
మతం జాడ తెలియరాలేదు
స్నేహాలు చేయూత నివ్వనేలేదు
మానవత్వం కనీసం కనికరం చూపనేలేదు,
దగ్గరకు రాలేక, పోయాక పోలేక
అసహాయత,
పైవాడు మొండివాడుగా ఉండక,
కొందరిలో కదలిక, మెలికలు చేకూర్చి,
తొలకరి చినుకులా ఆపన్నహస్తాలు అస్త్రాల శక్తిని నింపి నిలువెత్తు ఆదర్శమై జగత్తులో చాటే
ఇదే కదా సిసలైన సాక్ష్యం, మోక్షానికి రహదారి...
రచన...సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్( చురకశ్రీ) కావలి.