నేను, నీవు ఒకటే !
నీవు వెలగ నప్పుడు నిగనిగలాడుతూ,
నే;నా పుట్టింట తిరుగాడునప్పుడు మిసమిసలాడుతూ;
నిన్ను వెలిగించినా కాంతిని ఇస్తూ వేడి సన్నటిధారల పరుగులు!!
నా అందమైన సుకుమారమైన మెడలో పుస్తెలు పడ్డాక; ఆనందమైన; తీపి గురుతుల తిరగలి తిరుగులు!
కాస్తంత కాలం జరిగాక బరువు బాధ్యతలతో,
నే; ఉక్కిరిబిక్కిరి నా అందచందాలు తరుగులు!
అలా;
నీలో సారం అయిపోతూంటే నీ నున్నని తలం వికారమైన బొబ్బలు!!
నాలో కూడా అంతే అంద విహీనమైన ముడతలు; తుదకు! నీవు చీకటిని చీల్చి!! వెలుగులు నింపి; నీవు రాల్చిన వేడి నీటిలో మునిగి ఆరిపోతావు!
నేను అంతే!! నా అవసరం అంతే!!
నే; నా వారి కోసం పనిచేసి,చేసి అలసిసొలసి భువిలో కలిసిపోతాను !
అదే నీకు,నాకు ఆనందం, నిన్ను నీవు దహించుకొని ప్రకాశించావు!
నన్ను నేను ఆవహించుకొని ప్రజ్వలనం చేశాను!!
అందుకే ఇద్దరిది ఒకే ధరి!ఒకే దారి!!
నీవు; నేను కాలుతూ,కాలిపోతూ,కరిగిపోతూ,తరిగిపోతూ!
ఒక వెలుగు, వెలుగుతూ,కర్తవ్యాన్ని పూర్తి చేస్తూ కదలిపోతాం! ఇంతటి భాగ్యం ఎవరికి కలుగు ఇరువులం కాలానికి సాధకులం! సమిధిలం వెలుగుతూ ,వెలిగిస్తూ ఆరిపోయే ప్రమిదలం...
రచన...సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్( చురకశ్రీ) కావలి.